Verse 1 — Surah Al-Fatiha 1:1
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
Verse 2 — Surah Al-Fatiha 1:2
సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు
Verse 3 — Surah Al-Fatiha 1:3
అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత
Verse 4 — Surah Al-Fatiha 1:4
తీర్పుదినానికి స్వామి
Verse 5 — Surah Al-Fatiha 1:5
మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము
Verse 6 — Surah Al-Fatiha 1:6
మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి
Verse 7 — Surah Al-Fatiha 1:7
నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు