Back to Languages

Telugu - Chapter 36 - Ya-Sin

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Ya-Sin 36:1

Verse 2 — Surah Ya-Sin 36:2

వివేకంతో నిండి ఉన్న ఖుర్ఆన్ సాక్షిగా

Verse 3 — Surah Ya-Sin 36:3

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు సందేశహరులలో ఒకడవు

Verse 4 — Surah Ya-Sin 36:4

(నీవు) ఋజుమార్గంపై ఉన్నావు

Verse 5 — Surah Ya-Sin 36:5

ఇది (ఈ ఖుర్ఆన్) సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత ద్వారానే అవతరింపజేయబడింది

Verse 6 — Surah Ya-Sin 36:6

ఏ జాతి వారి తండ్రి తాతలైతే హెచ్చరిక చేయబడక, నిర్లక్ష్యులై ఉన్నారో, వారిని హెచ్చరించటానికి

Verse 7 — Surah Ya-Sin 36:7

వాస్తవానికి వారిలో అనేకులను గురించి మా వాక్కు నిజం కానున్నది, కావున వారు విశ్వసించరు

Verse 8 — Surah Ya-Sin 36:8

నిశ్చయంగా, మేము వారి మెడలలో పట్టాలు వేశాము. అవి వారి గడ్డాల వరకు వున్నాయి. కావున వారి తలలు నిక్కి వున్నాయి

Verse 9 — Surah Ya-Sin 36:9

మరియు మేము వారి ముందు ఒక అడ్డు (తెరను) మరియు వారి వెనుక ఒక అడ్డు (తెర)ను నిలబెట్టాము. మరియు మేము వారిని కప్పి వేశాము అందువల్ల వారు ఏమీ చూడలేరు

Verse 10 — Surah Ya-Sin 36:10

మరియు నీవు వారిని హెచ్చరించినా, హెచ్చరించక పోయినా, వారికి సమానమే, వారు విశ్వసించరు

Verse 11 — Surah Ya-Sin 36:11

నిశ్చయంగా, ఎవడైతే హితబోధను అనుసరిస్తూ, అగోచరుడైన కరుణామయునికి భయపడతాడో! అతనిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. అతనికి క్షమాభిక్ష మరియు మంచి ప్రతిఫలం (స్వర్గం) లభిస్తుందనే శుభవార్తను అందజేయి

Verse 12 — Surah Ya-Sin 36:12

నిశ్చయంగా, మేము మృతులను సజీవులుగా చేస్తాము. మరియు మేము వారు చేసి పంపిన మరియు తమ వెనుక విడిచిన చిహ్నాలను కూడా వ్రాసి పెడుతున్నాము. మరియు ప్రతి విషయాన్ని మేము స్పష్టమైన గ్రంథంలో వ్రాసిపెడుతున్నాము

Verse 13 — Surah Ya-Sin 36:13

వారికి సందేశహరులను పంపిన ఆ నగరవాసుల గాథను వినిపించు

Verse 14 — Surah Ya-Sin 36:14

మేము వారి వద్దకు ఇద్దరిని పంపగా వారు ఆ ఇద్దరినీ అబద్ధీకులని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని మూడవ వానితో బలపరిచాము. అప్పుడు వారు, వారితో: "నిశ్చయంగా, మేము (మీ వద్దకు పంపబడిన) సందేశహరులం" అని అన్నారు

Verse 15 — Surah Ya-Sin 36:15

(దానికి ఆ నగరవాసులు) ఇలా అన్నారు: "మీరు కేవలం మా వంటి మానవులే మరియు అనంత కరుణామయుడు మీపై ఏదీ (సందేశాన్నీ) అవతరింపజేయలేదు. మీరు కేవలం అబద్ధాలాడుతున్నారు

Verse 16 — Surah Ya-Sin 36:16

(ఆ ప్రవక్తలు) అన్నారు: "మా ప్రభువుకు తెలుసు, నిశ్చయంగా మేము మీ వద్దకు పంపబడిన సందేశహరులము

Verse 17 — Surah Ya-Sin 36:17

మా బాధ్యత కేవలం మీకు స్పష్టంగా సందేశాన్ని అందజేయటమే

Verse 18 — Surah Ya-Sin 36:18

(ఆ నగరవాసులు) అన్నారు; "నిశ్చయంగా, మేము మిమ్మల్ని ఒక దుశ్శకునంగా పరిగణిస్తున్నాము. మీరు దీనిని మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తాము. మరియు మా నుండి మీకు బాధాకరమైన శిక్ష పడుతుంది

Verse 19 — Surah Ya-Sin 36:19

(ఆ ప్రవక్తలు) అన్నారు: "మీ అపశకునం మీ వెంటనే ఉంది. మీకు చేసే హితబోధను (మీరు అపశకునంగా పరిగణిస్తున్నారా)? అది కాదు, అసలు మీరు మితిమీరి పోయిన ప్రజలు

Verse 20 — Surah Ya-Sin 36:20

ఆ నగరపు దూర ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఈ సందశహరులను అనుసరించండి

Verse 21 — Surah Ya-Sin 36:21

మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ కోరని వారిని (ఈ సందేశహరులను) అనుసరించండి! వారు సన్మార్గంలో ఉన్నారు

Verse 22 — Surah Ya-Sin 36:22

మరియు నన్ను సృష్టించిన ఆయనను నేనెందుకు ఆరాధించకూడదూ? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు

Verse 23 — Surah Ya-Sin 36:23

ఏమీ? ఆయనను వదలి నేను ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకోవాలా? ఒకవేళ ఆ కరుణామయుడు నాకు హాని చేయదలచుకుంటే, వారి సిఫారసు నాకు ఏ మాత్రం ఉపయోగ పడదు మరియు వారు నన్ను కాపాడనూలేరు

Verse 24 — Surah Ya-Sin 36:24

అలా చేస్తే నిశ్చయంగా, నేను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి పోయిన వాడిని అవుతాను

Verse 25 — Surah Ya-Sin 36:25

నిశ్చయంగా, నేను మీ ప్రభువును విశ్వసిస్తున్నాను, కావున మీరు నా మాట వినండి

Verse 26 — Surah Ya-Sin 36:26

(అతనిని వారు చంపిన తరువాత అతనితో) ఇలా అనబడింది: "నీవు స్వర్గంలో ప్రవేశించు." అతడు ఇలా అన్నాడు: "అయ్యో! నా జాతి వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండేది

Verse 27 — Surah Ya-Sin 36:27

నా ప్రభువు నన్ను క్షమించాడు మరియు నన్ను గౌరవనీయులలోకి ప్రవేశింపజేశాడు!" అనేది

Verse 28 — Surah Ya-Sin 36:28

మరియు ఆ తరువాత అతని జాతి వారి మీదకు, మేము ఆకాశం నుండి ఏ సైన్యాన్నీ పంపలేదు. అసలు మాకు సైన్యాన్ని పంపే అవసరమే ఉండదు

Verse 29 — Surah Ya-Sin 36:29

అది కేవలం ఒక పెద్ద ధ్వని మాత్రమే! అంతే! వారంతా (ఒకేసారి) అంతం చేయబడ్డారు

Verse 30 — Surah Ya-Sin 36:30

ఆ దాసుల గతి ఎంత శోచనీయమయినది! వారి వద్దకు ఏ సందేశహరుడు వచ్చినా, వారు అతనిని ఎగతాళి చేయకుండా ఉండలేదు

Verse 31 — Surah Ya-Sin 36:31

ఏమీ? వారు చూడలేదా (వారికి తెలియదా)? వారికి ముందు మేము ఎన్నో తరాలను నాశనం చేశామని? నిశ్చయంగా, వారు (వారి పూర్వీకులు) ఎన్నటికీ వారి వద్దకు తిరిగి రాలేదు

Verse 32 — Surah Ya-Sin 36:32

కాని వారందరినీ కలిపి ఒకేసారి, మా ముందు హాజరు పరచడం జరుగుతుంది

Verse 33 — Surah Ya-Sin 36:33

మరియు వారి కొరకు సూచనగా జీవం లేని ఈ భూమియే ఉంది. మేము దీనికి ప్రాణం పోసి, దీని నుండి ధాన్యం తీస్తాము, దాన్ని వారు తింటారు

Verse 34 — Surah Ya-Sin 36:34

మేము దీనిలో ఖర్జూరపు మరియు ద్రాక్ష వనాలను పెంచాము మరియు వాటిలో ఊటలను ప్రవహింపజేశాము

Verse 35 — Surah Ya-Sin 36:35

వారు దీని ఫలాలను తినటానికి; మరియు ఇదంతా వారి చేతులు చేసింది కాదు. అయినా వారు కృతజ్ఞతలు తెలుపరా

Verse 36 — Surah Ya-Sin 36:36

భూమి నుండి ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులలో, జీవులలో మరియు స్వయాన వారిలో (మానవులలో) ఇంకా వారికి తెలియని వాటిలోనూ (ఆడ-మగ) జతలను సృష్టించిన ఆయన (అల్లాహ్) లోపాలకు అతీతుడు

Verse 37 — Surah Ya-Sin 36:37

మరియు వారి కొరకు మా సూచనలలో రాత్రి ఒకటి; మేము దానిపై నుండి పగటిని (వెలుగును) తొలగించి నప్పుడు, వారిని చీకటి ఆవరించుకుంటుంది

Verse 38 — Surah Ya-Sin 36:38

మరియు సూర్యుడు తన నిర్ణీత పరిధిలో, నిర్ణీత కాలంలో పయనిస్తూ ఉంటాడు. ఇది ఆ సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని నియమావళి

Verse 39 — Surah Ya-Sin 36:39

మరియు చంద్రుని కొరకు మేము దశలను నియమించాము, చివరకు అతడు ఎండిన ఖర్జురపు మట్ట వలే అయిపోతాడు

Verse 40 — Surah Ya-Sin 36:40

చంద్రుణ్ణి అందుకోవటం సూర్యుడి తరం కాదు. మరియు రాత్రి పగటిని అధిగమించ జాలదు. మరియు అవన్నీ తమ తమ కక్ష్యలలో సంచరిస్తూ ఉంటాయి

Verse 41 — Surah Ya-Sin 36:41

వారికి మరొక సూచన ఏమిటంటే, నిశ్చయంగా, మేము వారి సంతతిని (నూహ్ యొక్క) నిండు నావ లోనికి ఎక్కించాము

Verse 42 — Surah Ya-Sin 36:42

మరియు మేము వారు ఎక్కి ప్రయాణం చేయటానికి, ఇటువంటి వాటిని ఎన్నో సృష్టించాము

Verse 43 — Surah Ya-Sin 36:43

మరియు మేము కోరినట్లయితే, వారిని ముంచి వేసే వారము; అప్పుడు వారి కేకలు వినేవాడెవడూ ఉండడు మరియు వారు రక్షింపబడనూ లేరు

Verse 44 — Surah Ya-Sin 36:44

మేము కరుణిస్తే తప్ప - మరియు మేము కొంత కాలం వరకు వారికి వ్యవధినిస్తే తప్ప

Verse 45 — Surah Ya-Sin 36:45

మరియు వారితో: "మీరు, మీ ముందున్న దానికీ (ఇహలోక శిక్షకూ) మరియు మీ వెనుక రానున్న దానికీ (పరలోక శిక్షకూ) భీతిపరులై ఉండండి, బహుశా మీరు కరుణింప బడవచ్చు!" అని అన్నప్పుడు, (వారు లక్ష్యం చేయటం లేదు)

Verse 46 — Surah Ya-Sin 36:46

మరియు వారి ప్రభువు సూచనలలో నుండి, వారి వద్దకు ఏ సూచన వచ్చినా, వారు దాని నుండి ముఖం త్రిప్పుకోకుండా ఉండలేదు

Verse 47 — Surah Ya-Sin 36:47

మరియు వారితో: "అల్లాహ్ మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేయండి." అని అన్నప్పుడు, సత్యతిరస్కారులు విశ్వాసులతో అంటారు: "ఏమీ? అల్లాహ్ కోరితే, తానే తినిపించగల వారికి, మేము తినిపించాలా? మీరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు

Verse 48 — Surah Ya-Sin 36:48

వారు ఇంకా ఇలా అంటారు: "మీరు సత్యవంతులే అయితే, ఆ వాగ్దానం (పునరుత్థానం) ఎప్పుడు పూర్తి కానున్నది

Verse 49 — Surah Ya-Sin 36:49

వారు నిరీక్షిస్తున్నది కేవలం ఒక పెద్ద ధ్వని కొరకే. మరియు వారు వాదులాడుకుంటూ ఉండగానే, అది వారిని చిక్కించుకుంటుంది

Verse 50 — Surah Ya-Sin 36:50

వారు ఏ విధమైన వీలునామా కూడా వ్రాయలేరు మరియు తమ కుటుంబం వారి వద్దకు కూడా తిరిగి పోలేరు

Verse 51 — Surah Ya-Sin 36:51

మరియు (మరొకసారి) బాకా ఊదబడి నప్పుడు, వారంతా గోరీల నుండి (లేచి) తమ ప్రభువు వైపునకు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తారు

Verse 52 — Surah Ya-Sin 36:52

వారంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా పడకల నుండి లేపి ఎవరు నిలబెట్టారు?" (వారితో అనబడుతుంది): "ఇదే ఆ కరుణామయుడు చేసిన వాగ్దానం. మరియు అతని సందేశహరులు సత్యమే పలికారు

Verse 53 — Surah Ya-Sin 36:53

అది కేవలం ఒక పెద్ద ధ్వని మాత్రమే అయి ఉంటుంది! వెంటనే వారంతా మా ముందు హాజరు చేయబడతారు

Verse 54 — Surah Ya-Sin 36:54

ఆ రోజు ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం జరుగదు. మరియు మీ కర్మలకు తగినది తప్ప, మరే ప్రతిఫలమివ్వబడదు

Verse 55 — Surah Ya-Sin 36:55

నిశ్చయంగా, ఆ రోజు స్వర్గవాసులు సుఖసంతోషాలలో నిమగ్నులై ఉంటారు

Verse 56 — Surah Ya-Sin 36:56

వారు మరియు వారి సహవాసులు (అజ్వాజ్), చల్లని నీడలలో, ఆనుడు ఆసనాల మీద హాయిగా కూర్చొని ఉంటారు

Verse 57 — Surah Ya-Sin 36:57

అందులో వారికి ఫలాలు మరియు వారు కోరే వన్నీ ఉంటాయి

Verse 58 — Surah Ya-Sin 36:58

మీకు శాంతి కలుగుగాక (సలాం)!" అనే పలుకులు అపార కరుణా ప్రదాత అయిన ప్రభువు తరఫు నుండి వస్తాయి

Verse 59 — Surah Ya-Sin 36:59

ఇంకా (ఇలా అనబడుతుంది): "ఓ అపరాధులారా! ఈనాడు మీరు వేరయి పొండి

Verse 60 — Surah Ya-Sin 36:60

ఓ ఆదమ్ సంతతివారలారా: 'షైతానును ఆరాధించకండి' అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా? నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు

Verse 61 — Surah Ya-Sin 36:61

మరియు మీరు నన్నే ఆరాధించండి. ఇదే ఋమార్గమనీ

Verse 62 — Surah Ya-Sin 36:62

మరియు వాస్తవానికి వాడు (షైతాన్) మీలో పెద్ద సమూహాన్ని దారి తప్పించాడు. ఏమీ? మీకు తెలివి లేక పోయిందా

Verse 63 — Surah Ya-Sin 36:63

మీకు వాగ్దానం చేయబడిన ఆ నరకం ఇదే

Verse 64 — Surah Ya-Sin 36:64

మీరు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నందుకు, ఈ రోజు దీనిలో ప్రవేశించండి (కాలండి)

Verse 65 — Surah Ya-Sin 36:65

ఆ రోజు మేము వారి నోళ్ళ మీద ముద్ర వేస్తాము. మరియు వారేమి అర్జించారో వారి చేతులు మాతో చెబుతాయి మరియు వారి కాళ్ళు మా ముందు సాక్ష్యమిస్తాయి

Verse 66 — Surah Ya-Sin 36:66

మరియు మేము కోరినట్లయితే, వారి దృష్టిని నిర్మూలించే వారము, అప్పుడు వారు దారి కొరకు పెనుగులాడే వారు, కాని వారు ఎలా చూడగలిగే వారు

Verse 67 — Surah Ya-Sin 36:67

మరియు మేము కోరినట్లయితే, వారిని వారి స్థానంలోనే రూపాన్ని మార్చి ఉంచే వారం, అప్పుడు వారు ముందుకూ పోలేరు మరియు వెనుకకూ మరలలేరు

Verse 68 — Surah Ya-Sin 36:68

మరియు మేము ఎవరికి దీర్ఘాయువు నొసంగుతామో, అతని శారీరక రూపాన్ని మార్చుతాము. ఏమీ? వారు ఇది కూడా గ్రహించలేరా

Verse 69 — Surah Ya-Sin 36:69

మరియు మేము అతనికి (ముహమ్మద్ కు) కవిత్వం నేర్పలేదు. మరియు అది అతనికి శోభించదు కూడా! ఇది కేవలం ఒక హితోపదేశం మరియు స్పష్టమైన పఠన గ్రంథం (ఖుర్ఆన్) మాత్రమే

Verse 70 — Surah Ya-Sin 36:70

బ్రతికి వున్న ప్రతివానికి హెచ్చరిక చేయటానికి మరియు సత్యతిరస్కారుల ఎడల మా ఆదేశాన్ని నిరూపించటానికి

Verse 71 — Surah Ya-Sin 36:71

ఏమీ, వారికి తెలియదా? నిశ్చయంగా, మేము వారికి వారి కొరకు మా చేతులతో పశువులను సృష్టించి, తరువాత వాటిపై వారికి యాజమాన్యం ఇచ్చామని

Verse 72 — Surah Ya-Sin 36:72

మరియు వాటిని, వారికి స్వాధీనపరిచాము. కావున వాటిలో కొన్నిటిపై వారు స్వారీ చేస్తారు, మరికొన్నిటిని (వాటి మాంసాన్ని) వారు తింటారు

Verse 73 — Surah Ya-Sin 36:73

మరియు వాటిలో వారికి ఎన్నో ప్రయోజనాలు మరియు పానీయాలు (పాలు) ఉన్నాయి. అయినా, వారెందుకు కృతజ్ఞతలు చూపరు

Verse 74 — Surah Ya-Sin 36:74

మరియు వారు అల్లాహ్ ను వదలి, ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు. బహుశా వారి వలన తమకు సహాయం దొరకుతుందేమోననే ఆశతో

Verse 75 — Surah Ya-Sin 36:75

వారు (ఆ దైవాలు), తమకెలాంటి సహాయ చేయలేరు. అయినా! వీరు (సత్యతిరస్కారులు) వారి (ఆ దైవాల) కొరకు సైన్యం మాదిరిగా సర్వసన్నద్ధులై ఉన్నారు

Verse 76 — Surah Ya-Sin 36:76

కావున (ఓ ముహమ్మద్!) వారి మాటలు నిన్ను బాధింపనివ్వరాదు. వాస్తవానికి! మాకు, వారు దాచేవి మరియు వెలిబుచ్చేవీ అన్నీ బాగా తెలుసు

Verse 77 — Surah Ya-Sin 36:77

ఏమీ? మానవుడు ఎరుగడా? నిశ్చయంగా, మేము అతనిని వీర్యబిందువుతో సృష్టించామని? అయినా! అతడు బహిరంగ ప్రత్యర్థిగా తయారయ్యాడు

Verse 78 — Surah Ya-Sin 36:78

మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరలిపోయాడు. అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు

Verse 79 — Surah Ya-Sin 36:79

ఇలా అను: "మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయనకు, ప్రతి దానిని సృష్టించే జ్ఞానముంది

Verse 80 — Surah Ya-Sin 36:80

ఆయనే పచ్చని చెట్టు నుండి మీ కొరకు అగ్నిని పుట్టించేవాడు, తరువాత మీరు దాని నుండి మంటను వెలిగించుకుంటారు

Verse 81 — Surah Ya-Sin 36:81

ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించగలవాడు, వాటి లాంటి వాటిని మరల సృష్టించలేడా? ఎందుకు చేయలేడు! ఆయనే సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు

Verse 82 — Surah Ya-Sin 36:82

నిశ్చయంగా, ఆయన విధానమేమిటంటే! ఆయన ఏదైనా చేయదలచు కున్నప్పుడు దానితో: "అయిపో!" అని అంటాడు, అంతే! అది అయిపోతుంది

Verse 83 — Surah Ya-Sin 36:83

ఎందుకంటే! సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) చేతిలో ప్రతిదానికి సంబంధించిన సర్వాధికారాలు ఉన్నాయి మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు