Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 37 - As-Saffat
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah As-Saffat 37:1
వరుసగా బారులు తీరి నిలుచున్న వారి (దైవదూతల) సాక్షిగా
Verse 2 — Surah As-Saffat 37:2
మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా
Verse 3 — Surah As-Saffat 37:3
ఈ ఉపదేశాన్ని (ఖుర్ఆన్ ను, అల్లాహ్ దగ్గరి నుండి మానవులకు) తెచ్చే వారి (దైవదూతల) సాక్షిగా
Verse 4 — Surah As-Saffat 37:4
నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం కేవలం ఆయన (అల్లాహ్) ఒక్కడే
Verse 5 — Surah As-Saffat 37:5
ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్యనున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు
Verse 6 — Surah As-Saffat 37:6
నిశ్చయంగా, మేము భూలోకానికి దగ్గరి ఆకాశాన్ని నక్షత్ర సముదాయాలతో అలంకరించాము
Verse 7 — Surah As-Saffat 37:7
మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ నుండి కాపాడటానికి
Verse 8 — Surah As-Saffat 37:8
ఇక వారు (షైతాన్ లు), ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు వారు ప్రతి దిక్కు నుండి తరుమబడుతూ ఉంటారు
Verse 9 — Surah As-Saffat 37:9
(ఎందుకంటే) వారు (షైతాన్ లు) బహిష్కరించ బడ్డారు. మరియు వారికి నిరంతరమైన శిక్ష ఉంది
Verse 10 — Surah As-Saffat 37:10
కాని, ఎవడైనా (ఏ షైతానైనా), దేనినైనా ఎగురవేసుకొని పోతున్నట్లైతే, మండే అగ్నిజ్వాల అతనిని వెంబడిస్తుంది
Verse 11 — Surah As-Saffat 37:11
అయితే వారిని అడగిండి: "ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ సృష్టి దృఢమైనదా?" నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (తీనిల్లాజిబ్) తో సృష్టించాము
Verse 12 — Surah As-Saffat 37:12
వాస్తవానికి, నీవైతే ఆశ్చర్యపడుతున్నావు, కాని వారు ఎగతాళి చేస్తున్నారు
Verse 13 — Surah As-Saffat 37:13
మరియు వారికి ఉపదేశమిచ్చినపుడు, వారు దానిని స్వీకరించరు
Verse 14 — Surah As-Saffat 37:14
మరియు వారొక సంకేతాన్ని చూసినప్పుడు, దానిని ఎగతాళి చేస్తారు
Verse 15 — Surah As-Saffat 37:15
మరియు వారిలా అంటారు: "ఇది స్పష్టమైన మంత్రజాలం మాత్రమే
Verse 16 — Surah As-Saffat 37:16
ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా
Verse 17 — Surah As-Saffat 37:17
ఏమిటి? మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా
Verse 18 — Surah As-Saffat 37:18
వారితో ఇలా అను: "అవును! అప్పుడు మీరు అధమమైన వారు అవుతారు
Verse 19 — Surah As-Saffat 37:19
నిశ్చయంగా, అది ఒక పెద్ద ధ్వని మాత్రమే (రెండవ బాకా), అప్పుడు వారు (లేచి) చూస్తూ ఉండిపోతారు
Verse 20 — Surah As-Saffat 37:20
మరియు వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదే ఆ తీర్పుదినం
Verse 21 — Surah As-Saffat 37:21
(అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "మీరు అబద్ధమని తిరస్కరిస్తూ ఉండే న్యాయవిచారణ దినం ఇదే
Verse 22 — Surah As-Saffat 37:22
(దైవదూతలతో ఇలా అనబడుతుంది): "ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని
Verse 23 — Surah As-Saffat 37:23
అల్లాహ్ ను కాదని - తరువాత వారందరికీ ప్రజ్వలించే నరకాగ్ని మార్గాన్ని చూపండి
Verse 24 — Surah As-Saffat 37:24
మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది
Verse 25 — Surah As-Saffat 37:25
మీకేమైంది? మీరు పరస్పరం ఎందుకు సహాయం చేసుకోవటం లేదు
Verse 26 — Surah As-Saffat 37:26
అలా కాదు! ఆ రోజు వారు తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు
Verse 27 — Surah As-Saffat 37:27
మరియు వారు ఒకరి వైపునకు మరొకరు మరలి ఇలా ప్రశ్నించుకుంటారు
Verse 28 — Surah As-Saffat 37:28
కొందరు అంటారు: "మీరు మా వద్దకు (మమ్మల్ని మోసగించటానికి) మా కుడివైపు నుండి వచ్చేవారు
Verse 29 — Surah As-Saffat 37:29
ఇతరులు ఇలా జవాబిస్తారు: "అలా కాదు, మీ అంతట మీరే విశ్వసించేవారు కాదు
Verse 30 — Surah As-Saffat 37:30
మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలా కాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు
Verse 31 — Surah As-Saffat 37:31
కావున, ఇప్పుడు మన ప్రభువు వాక్కు మనపై పూర్తి అయ్యింది. నిశ్చయంగా మనమంతా (శిక్షను) రుచి చూడగలము
Verse 32 — Surah As-Saffat 37:32
కావున మేము మిమ్మల్ని తప్పు దారిలో పడవేశాము, నిశ్చయంగా మేము కూడా మార్గభ్రష్టులమై ఉంటిమి
Verse 33 — Surah As-Saffat 37:33
అప్పుడు నిశ్చయంగా, వారందరూ ఆ రోజు శిక్షలో భాగస్వాములవుతారు
Verse 34 — Surah As-Saffat 37:34
నిశ్చయంగా, మేము అపరాధులతో ఇదే విధంగా ప్రవర్తిస్తాము
Verse 35 — Surah As-Saffat 37:35
వాస్తవానికి, వారితో: "అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు." అని అన్నప్పుడు, వారు దరహంకారం చూపేవారు
Verse 36 — Surah As-Saffat 37:36
మరియు వారు ఇలా అనేవారు: "ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా
Verse 37 — Surah As-Saffat 37:37
వాస్తవానికి, అతను (ముహమ్మద్) సత్యాన్ని తీసుకొని వచ్చాడు. మరియు అతను (తనకు పూర్వం వచ్చిన) ప్రవక్తలను సత్యవంతులని ధృవపరచాడు
Verse 38 — Surah As-Saffat 37:38
నిశ్చయంగా, మీరు బాధాకరమైన శిక్షను రుచి చూడగలరు
Verse 39 — Surah As-Saffat 37:39
మరియు మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ఫలితం తప్ప, మరేమీ ఇవ్వబడదు
Verse 40 — Surah As-Saffat 37:40
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప
Verse 41 — Surah As-Saffat 37:41
అలాంటి వారి కొరకు వారికి తెలిసి ఉన్న జీవనోపాధి ఉంది
Verse 42 — Surah As-Saffat 37:42
అన్ని రకాల ఫలాలు. మరియు వారు ఆదరించబడతారు
Verse 43 — Surah As-Saffat 37:43
పరమ సుఖాలు గల స్వర్గవనాలలో
Verse 44 — Surah As-Saffat 37:44
ఆసనాల మీద ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు
Verse 45 — Surah As-Saffat 37:45
వారి మధ్య ప్రవహించే చెలమల నుండి, పానీయపు (మధు) పాత్రలు త్రిప్పబడుతుంటాయి
Verse 46 — Surah As-Saffat 37:46
అది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది
Verse 47 — Surah As-Saffat 37:47
దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు
Verse 48 — Surah As-Saffat 37:48
మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు
Verse 49 — Surah As-Saffat 37:49
వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు
Verse 50 — Surah As-Saffat 37:50
అప్పుడు వారు ఒకరి వైపు కొకరు మరలి, పరస్పరం ఇలా ప్రశ్నించుకుంటారు
Verse 51 — Surah As-Saffat 37:51
వారిలో ఒకడంటాడు: "వాస్తవానికి (భూలోకంలో) నాకొక స్నేహితుడు (ఖరీనున్) ఉండేవాడు
Verse 52 — Surah As-Saffat 37:52
అతడు నన్ను ఇలా అడిగేవాడు: ఏమీ? నీవు కూడా (పునరుత్థానం) నిజమేనని నమ్మేవారిలో ఒకడివా
Verse 53 — Surah As-Saffat 37:53
ఏమీ? మనం చనిపోయి మట్టిగా ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా నిశ్చయంగా మనకు ప్రతిఫలమనేది ఉంటుందా
Verse 54 — Surah As-Saffat 37:54
అతడు ఇంకా ఇలా అంటాడు: "ఏమీ? మీరు అతడిని చూడదలచుకున్నారా
Verse 55 — Surah As-Saffat 37:55
తరువాత అతడు తొంగి చూసి, అతడిని (తన పూర్వ స్నేహితుణ్ణి) భగభగ మండే నరకాగ్ని మధ్యలో చూస్తాడు
Verse 56 — Surah As-Saffat 37:56
అతడితో (ఆ స్నేహితునితో), అతడు అంటాడు: "అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను నాశనం చేసి ఉండేవాడివే
Verse 57 — Surah As-Saffat 37:57
ఒకవేళ నా ప్రభువు అనుగ్రహమే లేకున్నట్లయితే! నేను కూడా (నరకానికి) హాజరు చేయబడిన వారిలో చేరి పోయేవాడిని
Verse 58 — Surah As-Saffat 37:58
(తరువాత ఆ స్వర్గవాసి తన సహచరులతో అంటాడు): "ఏమీ? ఇక మనం మరల చనిపోము కదా
Verse 59 — Surah As-Saffat 37:59
మన మొదటి (భూలోక) మరణం తప్ప! మనకు ఇక ఎలాంటి శిక్ష పడదు కదా
Verse 60 — Surah As-Saffat 37:60
నిశ్చయంగా, ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)
Verse 61 — Surah As-Saffat 37:61
ఇలాంటి (స్థానం) పొందటానికి పాటుపడే వారు పాటు పడాలి
Verse 62 — Surah As-Saffat 37:62
ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు ఆతిథ్యమా
Verse 63 — Surah As-Saffat 37:63
నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము
Verse 64 — Surah As-Saffat 37:64
నిశ్చయంగా, అది నరకపు అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు
Verse 65 — Surah As-Saffat 37:65
దాని మొగ్గలు షైతానుల తలల వలే ఉంటాయి
Verse 66 — Surah As-Saffat 37:66
నిశ్చయంగా, వారు దాని నుంచే తింటారు మరియు దానితోనే తమ కడుపులు నింపుకుంటారు
Verse 67 — Surah As-Saffat 37:67
తరువాత నిశ్చయంగా, దాని మీద వారికి త్రాగటానికి సలసల కాగే పానీయం మాత్రమే ఉంటుంది
Verse 68 — Surah As-Saffat 37:68
ఆ తరువాత నిశ్చయంగా, వారి మరలింపు కేవలం భగభగ మండే నరకాగ్ని వైపునకే అవుతుంది
Verse 69 — Surah As-Saffat 37:69
నిశ్చయంగా, అప్పుడు వారు తమ తండ్రితాతలు, మార్గభ్రష్టత్వంలో ఉండేవారని కనుగొంటారు
Verse 70 — Surah As-Saffat 37:70
మరియు తాము కూడా వారి అడుగు జాడలను అనుసరించటానికి త్వరపడుతూ ఉండేవారమని
Verse 71 — Surah As-Saffat 37:71
మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలా మంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు
Verse 72 — Surah As-Saffat 37:72
మరియు వాస్తవానికి మేము వారి వద్దకు హెచ్చరిక చేయటానికి (సందేశహరులను) పంపి ఉన్నాము
Verse 73 — Surah As-Saffat 37:73
ఇక చూడు! హెచ్చరిక చేయబడిన వారి పర్యవసానం ఎలా ఉండిందో
Verse 74 — Surah As-Saffat 37:74
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప
Verse 75 — Surah As-Saffat 37:75
మరియు వాస్తవంగా, నూహ్ మమ్మల్ని వేడుకున్నాడు. ఎందుకంటే, మేము (ప్రార్థనలకు) ప్రత్యుత్తరమిచ్చే వారిలో సర్వోత్తములము
Verse 76 — Surah As-Saffat 37:76
మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము
Verse 77 — Surah As-Saffat 37:77
మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము
Verse 78 — Surah As-Saffat 37:78
మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము
Verse 79 — Surah As-Saffat 37:79
సర్వలోకాలలో నూహ్ కు శాంతి కలుగు గాక (సలాం)
Verse 80 — Surah As-Saffat 37:80
నిశ్చయంగా, మేము సజ్జనులకు ఈ విధంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాము
Verse 81 — Surah As-Saffat 37:81
నిశ్చయంగా, అతను మా విశ్వాసులైన దాసులలోని వాడు
Verse 82 — Surah As-Saffat 37:82
తరువాత మేము ఇతరులను ముంచి వేశాము
Verse 83 — Surah As-Saffat 37:83
మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు
Verse 84 — Surah As-Saffat 37:84
అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి
Verse 85 — Surah As-Saffat 37:85
అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: "మీరు దేనిని ఆరాధిస్తున్నారు
Verse 86 — Surah As-Saffat 37:86
ఏమీ? మీరు అల్లాహ్ ను వదలి మిథ్యా (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా
Verse 87 — Surah As-Saffat 37:87
అయితే సర్వలోకాల ప్రభువును గురించి మీ అభిప్రాయమేమిటి
Verse 88 — Surah As-Saffat 37:88
ఆ తరువాత, అతను నక్షత్రాల వైపుకు తన దృష్టి సారించాడు
Verse 89 — Surah As-Saffat 37:89
అప్పుడు అతను ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నా ఆరోగ్యం బాగులేదు
Verse 90 — Surah As-Saffat 37:90
కావున వారు అతనిని వదలి పెట్టి వెళ్ళిపోయారు
Verse 91 — Surah As-Saffat 37:91
తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: "మీరు తినటం లేదేమిటి
Verse 92 — Surah As-Saffat 37:92
మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు
Verse 93 — Surah As-Saffat 37:93
తరువాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడిచేతితో వాటిని పగుల గొట్టాడు
Verse 94 — Surah As-Saffat 37:94
అప్పుడు, వారు (ప్రజలు) అతని దగ్గరకు త్వరత్వరగా వచ్చారు
Verse 95 — Surah As-Saffat 37:95
అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: "ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా
Verse 96 — Surah As-Saffat 37:96
వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా
Verse 97 — Surah As-Saffat 37:97
వారు (పరస్పరం ఇలా చెప్పుకున్నారు): "ఇతని కొరకు ఒక (అగ్ని) గుండం నిర్మించి, తరువాత ఇతనిని ఆ భగభగ మండే అగ్నిలో పడవేయండి
Verse 98 — Surah As-Saffat 37:98
కావున, వారు అతనికి విరుద్ధంగా పన్నాగాలు పన్నారు, కాని మేము వారిని కించపరచాము
Verse 99 — Surah As-Saffat 37:99
మరియు అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొని వెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు
Verse 100 — Surah As-Saffat 37:100
(అతను ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నాకు సద్వర్తనుడైన (కుమారుణ్ణి) ప్రసాదించు
Verse 101 — Surah As-Saffat 37:101
కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్త నిచ్చాము
Verse 102 — Surah As-Saffat 37:102
ఆ బాలుడు అతనికి తోడుగా శ్రమ చేయగల వయస్సుకు చేరుకున్నప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "ఓ నా కుమారా! వాస్తవానికి నేను నిన్ను బలి (జిబహ్) చేస్తున్నట్లుగా కలలో చూశాను, ఇక నీ సలహా ఏమిటో చెప్పు!" అతను (ఇస్మాయీల్) అన్నాడు: "ఓ నాన్నా! నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చు, అల్లాహ్ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు
Verse 103 — Surah As-Saffat 37:103
ఆ తరువాత వారిద్దరూ ఆయన (అల్లాహ్) ఆజ్ఞను నెరవేర్చటానికి సిద్ధ పడ్డారు. మరియు అతను (ఇబ్రాహీమ్) అతనిని (ఇస్మాయీల్ ను) నుదుటిపై బోర్లా పరుండబెట్టాడు
Verse 104 — Surah As-Saffat 37:104
మరియు మేము అతనిని పిలుస్తూ ఇలా అన్నాము: "ఓ ఇబ్రాహీమ్
Verse 105 — Surah As-Saffat 37:105
వాస్తవంగా, నీవు కలన నిజం చేసి చూపించావు!" నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమిస్తాము
Verse 106 — Surah As-Saffat 37:106
నిశ్చయంగా, ఇదొక స్పష్టమైన (కఠిన) పరీక్ష
Verse 107 — Surah As-Saffat 37:107
మరియు మేము అతనికి (ఇస్మాయీల్ కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము
Verse 108 — Surah As-Saffat 37:108
మరియు తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని నిలిపాము
Verse 109 — Surah As-Saffat 37:109
ఇబ్రాహీమ్ కు శాంతి కలుగు గాక (సలాం)
Verse 110 — Surah As-Saffat 37:110
ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము
Verse 111 — Surah As-Saffat 37:111
నిశ్చయంగా, అతను (ఇబ్రాహీమ్) విశ్వసించిన మా దాసులలోని వాడు
Verse 112 — Surah As-Saffat 37:112
మరియు మేము అతనికి ఇస్ హాఖ్ యొక్క శుభవార్తను ఇచ్చాము, అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త
Verse 113 — Surah As-Saffat 37:113
మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు ఇస్ హాఖ్ ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండే వారు. మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు
Verse 114 — Surah As-Saffat 37:114
మరియు వాస్తవానికి, మేము మూసా మరియు హారూన్ లను అనుగ్రహించాము
Verse 115 — Surah As-Saffat 37:115
మరియు మేము వారిద్దరిని మరియు వారి జాతి వారిని మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము
Verse 116 — Surah As-Saffat 37:116
మరియు మేము వారికి సహాయం చేశాము, కాబట్టి వారు విజయం పొందిన వారయ్యారు
Verse 117 — Surah As-Saffat 37:117
మరియు వారిద్దరికి (మంచి చెడులను) స్పష్టపరిచే గ్రంథాన్ని ప్రసాదించాము
Verse 118 — Surah As-Saffat 37:118
మరియు వారిద్దరికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము
Verse 119 — Surah As-Saffat 37:119
మరియు ఆ తరువాత తరాల వారిలో వారిద్దరి గురించి మంచి కీర్తిని నిలిపాము
Verse 120 — Surah As-Saffat 37:120
మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)
Verse 121 — Surah As-Saffat 37:121
నిశ్చయంగా, ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము
Verse 122 — Surah As-Saffat 37:122
నిశ్చయంగా వారిద్దరూ, విశ్వాసులైన మా దాసులలోని వారు
Verse 123 — Surah As-Saffat 37:123
మరియు నిశ్చయంగా, ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు
Verse 124 — Surah As-Saffat 37:124
అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా
Verse 125 — Surah As-Saffat 37:125
ఏమీ? మీరు బఅల్ (అనే విగ్రహాన్ని) ఆరాధిస్తూ సర్వోత్తముడైన సృష్టికర్తను వదలి పెడుతున్నారా
Verse 126 — Surah As-Saffat 37:126
అల్లాహ్ యే మీ ప్రభువు! మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కదా
Verse 127 — Surah As-Saffat 37:127
కాని వారు అతనిని (ఇల్యాస్ ను) అసత్యవాదుడని తిరస్కరించారు, కాబట్టి వారు తప్పకుండా (శిక్ష కొరకు) హాజరు చేయబడతారు
Verse 128 — Surah As-Saffat 37:128
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప
Verse 129 — Surah As-Saffat 37:129
తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము
Verse 130 — Surah As-Saffat 37:130
ఇల్ యాసీన్ కు శాంతి కలుగు గాక (సలాం)
Verse 131 — Surah As-Saffat 37:131
నిశ్చయంగా, సజ్జనులకు మేము ఈ విధంగా ప్రతిఫలమిస్తాము
Verse 132 — Surah As-Saffat 37:132
నిశ్చయంగా, అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు
Verse 133 — Surah As-Saffat 37:133
మరియు నిశ్చయంగా లూత్ కూడా మేము పంపిన సందేశహరులలో ఒకడు
Verse 134 — Surah As-Saffat 37:134
ఎప్పుడైతే మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరిని రక్షించామో
Verse 135 — Surah As-Saffat 37:135
ముసలామె (అతని భార్య) తప్ప - ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది
Verse 136 — Surah As-Saffat 37:136
ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము
Verse 137 — Surah As-Saffat 37:137
మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు
Verse 138 — Surah As-Saffat 37:138
మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా
Verse 139 — Surah As-Saffat 37:139
మరియు నిశ్చయంగా, యూనుస్ కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు
Verse 140 — Surah As-Saffat 37:140
అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు
Verse 141 — Surah As-Saffat 37:141
అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు
Verse 142 — Surah As-Saffat 37:142
ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు
Verse 143 — Surah As-Saffat 37:143
అప్పుడతను, (అల్లాహ్) పవిత్రతను కొనియాడే వారిలోని వాడు కాకపోయినట్లైతే
Verse 144 — Surah As-Saffat 37:144
దాని (చేప) కడుపులో పునరుత్థాన దినం వరకు ఉండి పోయేవాడు
Verse 145 — Surah As-Saffat 37:145
ఆ పిదప మేము అతనిని అనారోగ్య స్థితిలో, ఒక దిగంబర మైదానంలో పడవేశాము
Verse 146 — Surah As-Saffat 37:146
మరియు అతనిపై ఒక ఆనప జాతి తీగను మొలిపించాము
Verse 147 — Surah As-Saffat 37:147
మరియు అతనిని ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ మంది (ప్రజల) వద్దకు పంపాము
Verse 148 — Surah As-Saffat 37:148
వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము
Verse 149 — Surah As-Saffat 37:149
అయితే వారిని ఇలా అడుగు: "ఏమీ? నీ ప్రభువుకైతే కుమార్తెలు మరియు వారి కొరకు కుమారులా
Verse 150 — Surah As-Saffat 37:150
లేక మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? మరియు వారు దానికి సాక్షులా
Verse 151 — Surah As-Saffat 37:151
అలా కాదు! నిశ్చయంగా, వారు (ఖురైషులు) తమ బూటకపు నమ్మకాల ఆధారంగా అంటున్నారు
Verse 152 — Surah As-Saffat 37:152
అల్లాహ్ కు సంతానముంది!"అని మరియు వారు నిశ్చయంగా, అబద్ధాలాడుతున్నారు
Verse 153 — Surah As-Saffat 37:153
ఆయన (అల్లాహ్) కుమార్తెలను - కుమారులకు బదులుగా -ఎన్నుకున్నాడా
Verse 154 — Surah As-Saffat 37:154
మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు చేస్తున్నారు
Verse 155 — Surah As-Saffat 37:155
ఏమీ? మీరు గ్రహించలేరా
Verse 156 — Surah As-Saffat 37:156
లేక! మీ వద్ద ఏదైనా స్పష్టమైన ప్రమాణం ఉందా
Verse 157 — Surah As-Saffat 37:157
మీరు సత్యవంతులే అయితే మీ గ్రంథాన్ని తీసుకురండి
Verse 158 — Surah As-Saffat 37:158
మరియు వారు, ఆయన (అల్లాహ్) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు. కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని
Verse 159 — Surah As-Saffat 37:159
వారు కల్పించే విషయాలకు అల్లాహ్ అతీతుడు (పరమ పవిత్రుడు)
Verse 160 — Surah As-Saffat 37:160
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప
Verse 161 — Surah As-Saffat 37:161
ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్యదైవాలు (కలిసి)
Verse 162 — Surah As-Saffat 37:162
ఎవ్వడిని కూడా, దుష్టకార్యాలు చేయటానికి పురి కొలుపలేరు
Verse 163 — Surah As-Saffat 37:163
భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప
Verse 164 — Surah As-Saffat 37:164
(దైవదూతలు ఇలా అంటారు): "మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింప బడకుండా లేడు
Verse 165 — Surah As-Saffat 37:165
మరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము
Verse 166 — Surah As-Saffat 37:166
మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడే వారమే
Verse 167 — Surah As-Saffat 37:167
మరియు (సత్యతిరస్కారులు) ఇలా అంటూ ఉండేవారు
Verse 168 — Surah As-Saffat 37:168
ఒకవేళ మా పూర్వీకుల నుండి మాకు ఇలాంటి బోధన లభించి ఉంటే
Verse 169 — Surah As-Saffat 37:169
మేము కూడా, అల్లాహ్ యొక్క ఎన్నుకున్న, భక్తులమై ఉండేవారము
Verse 170 — Surah As-Saffat 37:170
కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు
Verse 171 — Surah As-Saffat 37:171
మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా నిర్ణయం జరిగింది
Verse 172 — Surah As-Saffat 37:172
నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని
Verse 173 — Surah As-Saffat 37:173
మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని
Verse 174 — Surah As-Saffat 37:174
కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు
Verse 175 — Surah As-Saffat 37:175
మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు
Verse 176 — Surah As-Saffat 37:176
ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా
Verse 177 — Surah As-Saffat 37:177
కాని, అది వారి ఇంటి ప్రాంగణంలో దిగినప్పుడు, హెచ్చరించబడిన వారికి అది దుర్భరమైన ఉదయం కాగలదు
Verse 178 — Surah As-Saffat 37:178
కావున నీవు ప్రస్తుతానికి వారిని వదలి పెట్టు
Verse 179 — Surah As-Saffat 37:179
మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు
Verse 180 — Surah As-Saffat 37:180
నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు
Verse 181 — Surah As-Saffat 37:181
మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)
Verse 182 — Surah As-Saffat 37:182
మరియు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు