Back to Languages

Telugu - Chapter 52 - At-Tur

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah At-Tur 52:1

తూర్ పర్వతం సాక్షిగా

Verse 2 — Surah At-Tur 52:2

వ్రాయబడిన గ్రంథం సాక్షిగా

Verse 3 — Surah At-Tur 52:3

విప్పబడిన చర్మపత్రం మీద

Verse 4 — Surah At-Tur 52:4

చిరకాల సందర్శనాలయం సాక్షిగా

Verse 5 — Surah At-Tur 52:5

పైకెత్తబడిన కప్పు (అంతరిక్షం) సాక్షిగా

Verse 6 — Surah At-Tur 52:6

ఉప్పొంగే సముద్రం సాక్షిగా

Verse 7 — Surah At-Tur 52:7

నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష సంభవించ నున్నది

Verse 8 — Surah At-Tur 52:8

దానిని తప్పించేవాడు ఎవ్వడు లేడు

Verse 9 — Surah At-Tur 52:9

ఆకాశాలు భయంకరంగా కంపించే రోజు

Verse 10 — Surah At-Tur 52:10

మరియు పర్వతాలు దారుణంగా చలించినప్పుడు

Verse 11 — Surah At-Tur 52:11

అప్పుడు, ఆ రోజు అసత్యవాదులకు వినాశం ఉంది

Verse 12 — Surah At-Tur 52:12

ఎవరైతే వృథా మాటలలో కాలక్షేపం చేస్తూ ఉంటారో

Verse 13 — Surah At-Tur 52:13

వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడే రోజు

Verse 14 — Surah At-Tur 52:14

(వారితో ఇలా అనబడుతుంది): "మీరు అసత్యమని నిరాకరిస్తూ వుండిన నరకాగ్ని ఇదే

Verse 15 — Surah At-Tur 52:15

ఏమీ? ఇది మంత్రజాలమా? లేక దీనిని మీరు చూడలేక పోతున్నారా

Verse 16 — Surah At-Tur 52:16

ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా మీకు సమానమే! నిశ్చయంగా, మీ కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతున్నది

Verse 17 — Surah At-Tur 52:17

నిశ్చయంగా, భయభక్తులు గలవారు స్వర్గవనాలలో సుఖసంతోషాలలో ఉంటారు

Verse 18 — Surah At-Tur 52:18

వారి ప్రభువు వారికి ప్రసాదించిన వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. మరియు వారి ప్రభువు వారిని భగభగ మండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడాడు

Verse 19 — Surah At-Tur 52:19

(వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ వుండిన కర్మలకు ఫలితంగా హాయిగా తినండి త్రాగండి

Verse 20 — Surah At-Tur 52:20

వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద, దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు మేము అందమైన పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులతో వారి వివాహం చేయిస్తాము

Verse 21 — Surah At-Tur 52:21

మరియు ఎవరైతే విశ్వసిస్తారో మరియు వారి సంతానంవారు విశ్వాసంలో వారిని అనుసరిస్తారో! అలాంటి వారిని వారి సంతానంతో (స్వర్గంలో) కలుపుతాము. మరియు వారి కర్మలలో వారికి ఏ మాత్రం నష్టం కలిగించము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు

Verse 22 — Surah At-Tur 52:22

మరియు మేము వారికి, వారు కోరే ఫలాలను మరియు మాంసాన్ని పుష్కలంగా ప్రసాదిస్తాము

Verse 23 — Surah At-Tur 52:23

అందులో (ఆ స్వర్గంలో) వారు ఒకరి కొకరు (మధు) పాత్ర మార్చుకుంటూ ఉంటారు; దాన్ని (త్రాగటం) వల్ల వారు వ్యర్థపు మాటలు మాట్లాడరు మరియు పాపాలు చేయరు

Verse 24 — Surah At-Tur 52:24

మరియు దాచబడిన ముత్యాల వంటి బాలురు, వారి సేవ కొరకు వారి చుట్టు ప్రక్కలలో తిరుగుతూ ఉంటారు

Verse 25 — Surah At-Tur 52:25

మరియు వారు ఒకరి వైపుకొకరు మరలి పరస్పరం (తమ గతించిన జీవితాలను గురించి) మాట్లాడుకుంటూ ఉంటారు

Verse 26 — Surah At-Tur 52:26

వారు ఇలా అంటారు: "వాస్తవానికి మనం ఇంతకు పూర్వం మన కుటుంబం వారి మధ్య ఉన్నప్పుడు (అల్లాహ్ శిక్షకు) భయపడుతూ ఉండేవారము

Verse 27 — Surah At-Tur 52:27

కావున నిశ్చయంగా, అల్లాహ్ మన మీద కనికరం చూపాడు మరియు మమ్ము దహించే గాలుల శిక్ష నుండి కాపాడాడు

Verse 28 — Surah At-Tur 52:28

నిశ్చయంగా, మనం ఇంతకు పూర్వం ఆయననే ప్రార్థిస్తూ ఉండేవారము. నిశ్చయంగా, ఆయన మహోపకారి, అపార కరుణా ప్రదాత

Verse 29 — Surah At-Tur 52:29

కావున (ఓ ప్రవక్తా!) నీవు హితోపదేశం చేస్తూ వుండు. నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు జ్యోతిష్కుడవు కావు మరియు పిచ్చివాడవూ కావు

Verse 30 — Surah At-Tur 52:30

లేదా? వారు: "ఇతను ఒక కవి, ఇతని వినాశకాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము. అని అంటున్నారా

Verse 31 — Surah At-Tur 52:31

వారితో ఇలా అను: "మీరు ఎదురు చూస్తూ ఉండండి, నిశ్చయంగా, నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తూ ఉంటాను

Verse 32 — Surah At-Tur 52:32

ఏమీ? వారి బుద్ధులు వారికి ఇవే ఆజ్ఞాపిస్తున్నాయా? లేక వారు తలబిరుసుతనం గల జనులా

Verse 33 — Surah At-Tur 52:33

ఏమీ? వారు: "ఇతనే, దీనిని (ఈ సందేశాన్ని) కల్పించుకున్నాడు" అని అంటున్నారా? అలా కాదు, వారు అసలు విశ్వసించ దలుచుకోలేదు

Verse 34 — Surah At-Tur 52:34

వారు సత్యవంతులే అయితే దీని వంటి ఒక వచనాన్ని (రచించి) తెమ్మను

Verse 35 — Surah At-Tur 52:35

వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా

Verse 36 — Surah At-Tur 52:36

లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు

Verse 37 — Surah At-Tur 52:37

వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా

Verse 38 — Surah At-Tur 52:38

వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానితో పైకెక్కి వారు (దేవదూతల మాటలు) వినటానికి? అలా అయితే! వారిలో ఎవడైతే విన్నాడో, అతనిని స్పష్టమైన నిదర్శనాన్ని తెమ్మను

Verse 39 — Surah At-Tur 52:39

ఆయన (అల్లాహ్) కు కూతుళ్ళూ మరియు మీకేమో కుమారులా

Verse 40 — Surah At-Tur 52:40

(ఓ ముహమ్మద్!) నీవు వారితో ఏమైనా ప్రతిఫలం అడుగుతున్నావా? వారు ఋణభారంతో అణిగి పోవటానికి

Verse 41 — Surah At-Tur 52:41

లేక వారి దగ్గర అగోచర విషయపు జ్ఞానముందా? వారు దానిని వ్రాసి పెట్టారా

Verse 42 — Surah At-Tur 52:42

లేక వారేదైనా పన్నాగం పన్నదలచారా? కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారే పన్నాగానికి గురి అవుతారు

Verse 43 — Surah At-Tur 52:43

లేక వారికి అల్లాహ్ గాకుండా మరొక ఆరాధ్య దేవుడు ఉన్నాడా? వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు

Verse 44 — Surah At-Tur 52:44

ఒకవేళ వారు ఆకాశపు ఒక తునకను రాలి పడటం చూసినా: "ఇవి దట్టమైన మేఘాలు!" అని అనేవారు

Verse 45 — Surah At-Tur 52:45

కావున వారు తమ (తీర్పు) దినాన్ని దర్శించే వరకు వారిని వదిలి పెట్టు. అప్పుడు వారు భీతితో మూర్ఛపోయి పడి పోతారు

Verse 46 — Surah At-Tur 52:46

ఆరోజు వారి పన్నాగం వారికి ఏ మాత్రం పనికి రాదు. మరియు వారికి ఎలాంటి సహాయం కూడా లభించదు

Verse 47 — Surah At-Tur 52:47

మరియు నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడిన వారికి, ఇదే గాక మరొక శిక్ష కూడా ఉంది, కాని వారిలో చాలా మందికి అది తెలియదు

Verse 48 — Surah At-Tur 52:48

కావున (ఓ ముహమ్మద్!) నీవు, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చే వరకు సహనం వహించు. నిశ్చయంగా, నీవు మా దృష్టిలో ఉన్నావు. మరియు నీవు నిద్ర నుండి లేచినపుడు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన స్తోత్రం చెయ్యి

Verse 49 — Surah At-Tur 52:49

మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు మరియు నక్షత్రాలు అస్తమించే వేళలో కూడాను