Back to Languages

Telugu - Chapter 68 - Al-Qalam

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Al-Qalam 68:1

నూన్, కలం సాక్షిగా! మరియు వారు (దేవదూతలు) వ్రాస్తున్న దాని సాక్షిగా

Verse 2 — Surah Al-Qalam 68:2

నీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ముహమ్మద్) పిచ్చివాడవు కావు

Verse 3 — Surah Al-Qalam 68:3

మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది

Verse 4 — Surah Al-Qalam 68:4

మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు

Verse 5 — Surah Al-Qalam 68:5

కావున త్వరలోనే నీవు చూడగలవు మరియు వారు కూడా చూడగలరు

Verse 6 — Surah Al-Qalam 68:6

మీలో ఎవరికి పిచ్చి ఉందో

Verse 7 — Surah Al-Qalam 68:7

నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు మార్గభ్రష్టుడయ్యాడో తెలుసు మరియు ఎవడు సన్మార్గం మీద ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు

Verse 8 — Surah Al-Qalam 68:8

కావున నీవు ఈ అసత్యవాదులను అనుసరించకు

Verse 9 — Surah Al-Qalam 68:9

ఒకవేళ నీవు (ధర్మం విషయంలో) మెత్తపడితే వారు కూడా మెత్తపడ కోరుతున్నారు

Verse 10 — Surah Al-Qalam 68:10

కావున నీవు ప్రమాణాలు చేసే ప్రతి నీచుడిని అనుసరించకు

Verse 11 — Surah Al-Qalam 68:11

చాడీలు చెప్పేవాడిని, ఎత్తి పొడుస్తూ ఉండేవాడిని

Verse 12 — Surah Al-Qalam 68:12

మంచిని నిరోధించేవాడిని, హద్దు మీరి ప్రవర్తించే పాపిష్ఠుడిని

Verse 13 — Surah Al-Qalam 68:13

నిర్ధయుడిని, ఇంతే గాకుండా అపఖ్యాతి గల (నిందార్హుడైన) వాడిని

Verse 14 — Surah Al-Qalam 68:14

వాడు ధనవంతుడూ మరియు సంతాన భాగ్యంతో తలతూగుతూ ఉన్నవాడు అయినా సరే

Verse 15 — Surah Al-Qalam 68:15

ఒకవేళ వాడికి మా సూచనలు (ఆయాత్) వినిపిస్తే, అందుకు వాడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు

Verse 16 — Surah Al-Qalam 68:16

మేము త్వరలోనే వాడి ముక్కు మీద వాత పెడ్తాము

Verse 17 — Surah Al-Qalam 68:17

నిశ్చయంగా, మేము ఆ తోటవారిని పరీక్షించినట్లుగా వీరిని కూడా పరీక్షిస్తాము. ఎవరైతే తెల్లవారగానే తప్పక దాని పంట కోసుకుందామని ప్రతిజ్ఞ చేసుకున్నారో

Verse 18 — Surah Al-Qalam 68:18

మరియు (అల్లాహ్ కోరితే) అనే, మినహాయింపుకు తావు ఇవ్వకుండా

Verse 19 — Surah Al-Qalam 68:19

కావున వారు పడుకొని ఉండగానే నీ ప్రభువు తరఫు నుండి దానిపై (ఆ తోటపై) ఒక ఆపద వచ్చి పడింది

Verse 20 — Surah Al-Qalam 68:20

దాంతో తెల్లవారే సరికి అది (ఆ తోట) పంట కోసిన పొలం వలే మారి పోయింది

Verse 21 — Surah Al-Qalam 68:21

తరువాత ఉదయం లేచి వారు ఒకరితో నొకరు ఇలా చెప్పుకోసాగారు

Verse 22 — Surah Al-Qalam 68:22

మీరు పంటను కోయదలుచుకుంటే ఉదయమే మీ పొలానికి వెళ్ళండి

Verse 23 — Surah Al-Qalam 68:23

ఆ తరువాత వారు ఒకరితోనొకరు (ఈ విధంగా) మెల్లగా చెప్పుకుంటూ బయలు దేరారు

Verse 24 — Surah Al-Qalam 68:24

ఈ రోజు ఏ పేదవాడిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి

Verse 25 — Surah Al-Qalam 68:25

మరియు వారు (పేదవారిని) దగ్గరకు రానివ్వకూడదని గట్టి నిర్ణయంతో తెల్లవారు ఝామున బయలు దేరారు

Verse 26 — Surah Al-Qalam 68:26

వారు దానిని (తోటను) చూసి ఇలా వాపోయారు: "నిశ్చయంగా, మనం దారి తప్పాము

Verse 27 — Surah Al-Qalam 68:27

కాదు! కాదు! మనం సర్వం కోల్పోయాము

Verse 28 — Surah Al-Qalam 68:28

వారిలో మధ్యరకానికి చెందినవాడు ఇలా అన్నాడు: "ఏమీ? నేను మీతో అనలేదా? మీరు ఎందుకు ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడరని ('ఇన్ షా అల్లాహ్!' అనరని)

Verse 29 — Surah Al-Qalam 68:29

వారు ఇలా అన్నారు: "మా ప్రభువు సర్వలోపాలకూ అతీతుడు! నిశ్చయంగా, మేమే దుర్మార్గులము

Verse 30 — Surah Al-Qalam 68:30

తరువాత వారు అభిముఖులై ఒకరి నొకరు నిందించుకోసాగారు

Verse 31 — Surah Al-Qalam 68:31

వారు ఇలా వాపోయారు: "అయ్యో! మా పాడుగాను! నిశ్చయంగా, మేము తలబిరుసుతనం చూపాము

Verse 32 — Surah Al-Qalam 68:32

బహశా! మన ప్రభువు మనకు దీనికి బదులుగా దీని కంటే శ్రేష్ఠమైన దానిని ప్రసాదించ వచ్చు! నిశ్చయంగా, మనం మన ప్రభువు వైపునకు (పశ్చాత్తాపంతో) మరలుదాము

Verse 33 — Surah Al-Qalam 68:33

ఈ విధంగా ఉంటుంది శిక్ష! మరియు పరలోక శిక్ష దీని కంటే ఘోరంగా ఉంటుంది. వారు ఇది తెలుసుకుంటే ఎంత బాగుండేది

Verse 34 — Surah Al-Qalam 68:34

నిశ్చయంగా, దైవభీతి గలవారికి వారి ప్రభువు వద్ద పరమానందకరమైన స్వర్గవనాలు ఉంటాయి

Verse 35 — Surah Al-Qalam 68:35

ఏమీ? మేము విధేయులను (ముస్లింలను) నేరస్థులతో సమానంగా ఎంచుదుమా

Verse 36 — Surah Al-Qalam 68:36

మీకేమయింది? మీరు ఏ విధమైన నిర్ణయాలు చేస్తున్నారు

Verse 37 — Surah Al-Qalam 68:37

మీ వద్ద ఏదయినా (దివ్య) గ్రంథముందా? దాని నుండి మీరు నేర్చుకోవటానికి

Verse 38 — Surah Al-Qalam 68:38

నిశ్చయంగా, అందులో మీకు, మీరు కోరేదంతా ఉందని

Verse 39 — Surah Al-Qalam 68:39

లేక, పునరుత్థాన దినం వరకు, మీరు నిర్ణయించుకున్నదే మీకు తప్పక లభిస్తుందని, మేము మీతో చేసిన గట్టి ప్రమాణం ఏదైనా ఉందా

Verse 40 — Surah Al-Qalam 68:40

వారిలో దీనికి ఎవడు హామీగా ఉన్నాడో అడుగు

Verse 41 — Surah Al-Qalam 68:41

లేక, వారికి ఎవరైనా (వారు అల్లాహ్ కు కల్పించిన) భాగస్వాములు ఉన్నారా? ఒకవేళ వారు సత్యవంతులే అయితే తమ ఆ భాగస్వాములను తీసుకు రమ్మను

Verse 42 — Surah Al-Qalam 68:42

(జ్ఞాపకముంచుకోండి) ఏ రోజయితే పిక్క ఎముక తెరిచి వేయబడుతుందో! మరియు వారు సాష్టాంగం (సజ్దా) చేయటానికి పిలువబడతారో, అప్పుడు వారు (కపట విశ్వాసులు), అలా (సజ్దా) చేయలేరు

Verse 43 — Surah Al-Qalam 68:43

వారి చూపులు క్రిందికి వాలిపోయి ఉంటాయి, అవమానం వారిని ఆవరించి ఉంటుంది. మరియు వాస్తవానికి వారు నిక్షేపంగా ఉన్నప్పుడు సాష్టాంగం (సజ్దా) చేయటానికి ఆహ్వానించబడితే (తిరస్కరించేవారు)

Verse 44 — Surah Al-Qalam 68:44

కావున నన్ను మరియు ఈ సందేశాన్ని అబద్ధమని తిరస్కరించే వారిని వదలండి. వారు గ్రహించని విధంగా మేము వారిని క్రమక్రమంగా (వినాశం వైపునకు) తీసుకొని పోతాము

Verse 45 — Surah Al-Qalam 68:45

మరియు నేను వారికి కొంత వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా పన్నాగం చాలా దృఢమైనది

Verse 46 — Surah Al-Qalam 68:46

లేక, (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఏదైనా ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నావా? వారికి దాని రుణం భారమవటానికి

Verse 47 — Surah Al-Qalam 68:47

లేక, వారి వద్ద ఏదైనా అగోచర జ్ఞానం ఉందా? వారు దానిని వ్రాసి పెట్టడానికి

Verse 48 — Surah Al-Qalam 68:48

కావున నీవు నీ ప్రభువు ఆజ్ఞ కొరకు వేచి ఉండు. మరియు నీవు, చేపవాని (యూనుస్) వలే వ్యవహరించకు. (గుర్తుకు తెచ్చుకో) అతను దుఃఖంలో ఉన్నప్పుడు (తన ప్రభువును) మొర పెట్టుకున్నాడు

Verse 49 — Surah Al-Qalam 68:49

అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి అందక పోయి ఉంటే, అతను అవమానకరమైన స్థితిలో (చేప కడుపులో పడి ఉండేవాడు కాని మేము అతనిని క్షమించాము). కావున అతను చౌట (బంజరు) మైదానంలో విసరి వేయ బడ్డాడు

Verse 50 — Surah Al-Qalam 68:50

చివరకు అతని ప్రభువు అతనిని ఎన్నుకొని సత్పురుషులలో చేర్చాడు

Verse 51 — Surah Al-Qalam 68:51

మరియు ఆ సత్యతిరస్కారులు, ఈ సందేశాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు, తమ చూపులతో నీ కాళ్ళు ఊడగొడతారా అన్నట్లు (నిన్ను జారించి పడవేసేటట్లు) నిన్ను చూస్తున్నారు. మరియు వారు నిన్ను (ఓ ముహమ్మద్!): "నిశ్చయంగా ఇతడు పిచ్చివాడు!" అని అంటున్నారు

Verse 52 — Surah Al-Qalam 68:52

కాని సర్వలోకాల (వారికి) ఇదొక హితోపదేశం మాత్రమే