Back to Languages

Telugu - Chapter 69 - Al-Haqqah

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Al-Haqqah 69:1

ఆ అనివార్య సంఘటన (పునరుత్థానం)

Verse 2 — Surah Al-Haqqah 69:2

ఏమిటా అనివార్య సంఘటన

Verse 3 — Surah Al-Haqqah 69:3

మరియు ఆ అనివార్య సంఘటన, అంటే ఏమిటో నీకేమి తెలుసు

Verse 4 — Surah Al-Haqqah 69:4

సమూద్ మరియు ఆద్ జాతి వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ ఉపద్రవాన్ని అసత్యమని తిరస్కరించారు

Verse 5 — Surah Al-Haqqah 69:5

కావున సమూద్ జాతి వారైతే ఒక భయంకరమైన గర్జన ద్వారా నాశనం చేయబడ్డారు

Verse 6 — Surah Al-Haqqah 69:6

మరియు ఆద్ జాతి వారేమో అతి తీవ్రమైన తుఫాను గాలి ద్వారా నాశనం చేయబడ్డారు

Verse 7 — Surah Al-Haqqah 69:7

ఆయన (అల్లాహ్), దానిని వారి మీద ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళ వరకు ఎడతెగకుండా ఆవరింపజేశాడు. దాని వలన వారు వేళ్ళతో పెళ్ళగించబడిన ఖర్జూరపు బోదెల వలే పాడై పోవటం, నీవు చూస్తావు

Verse 8 — Surah Al-Haqqah 69:8

అయితే ఇప్పుడు వారిలో ఎవరైనా మిగిలి ఉన్నట్లు నీవు చూస్తున్నావా

Verse 9 — Surah Al-Haqqah 69:9

ఫిర్ఔన్ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాల వారూ, అందరూ గొప్ప నేరాలకు పాల్పడినవారే

Verse 10 — Surah Al-Haqqah 69:10

మరియు వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలకు అవిధేయత కనబరచారు, కావున ఆయన వారిని కఠినమైన పట్టుతో పట్టుకున్నాడు

Verse 11 — Surah Al-Haqqah 69:11

నిశ్చయంగా, ఎప్పుడైతే (నూహ్ తుఫాన్) నీరు హద్దు లేకుండా ఉప్పొంగి పోయిందో! అప్పుడు మేము, మిమ్మల్ని పయనించే (నావలో) ఎక్కించాము

Verse 12 — Surah Al-Haqqah 69:12

దానిని, మీకొక హితబోధగానూ మరియు జ్ఞాపకముంచుకోగల చెవి, దానిని జ్ఞాపకం ఉంచుకోవటానికి అనువైనదిగా చేశాము

Verse 13 — Surah Al-Haqqah 69:13

ఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో

Verse 14 — Surah Al-Haqqah 69:14

మరియు భూమి మరియు పర్వతాలు పైకి ఎత్తబడి ఒక పెద్ద దెబ్బతో తుత్తునియలుగా చేయబడతాయో

Verse 15 — Surah Al-Haqqah 69:15

అప్పుడు, ఆ రోజున సంభవించవలసిన ఆ అనివార్య సంఘటన సంభవిస్తుంది

Verse 16 — Surah Al-Haqqah 69:16

మరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలై పోతుంది మరియు దాని వ్యవస్థ సడలి పోతుంది

Verse 17 — Surah Al-Haqqah 69:17

మరియు దేవదూతలు దాని (అర్ష్) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని (అర్ష్ ను), ఆ రోజు ఎనిమిది మంది (దేవదూతలు) ఎత్తుకొని ఉంటారు

Verse 18 — Surah Al-Haqqah 69:18

ఆ రోజు మీరు (తీర్పు కొరకు) హాజరు చేయబడతారు. మీరు దాచిన ఏ రహస్యం కూడా (ఆ రోజు) దాగి ఉండదు

Verse 19 — Surah Al-Haqqah 69:19

ఇక ఎవనికైతే తన కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: "ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి

Verse 20 — Surah Al-Haqqah 69:20

నిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించేవాడిని

Verse 21 — Surah Al-Haqqah 69:21

కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు

Verse 22 — Surah Al-Haqqah 69:22

అత్యున్నతమైన స్వర్గవనంలో

Verse 23 — Surah Al-Haqqah 69:23

దాని పండ్లగుత్తులు, సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి

Verse 24 — Surah Al-Haqqah 69:24

(వారితో ఇలా అనబడుతుంది): "గడిచి పోయిన దినాలలో మీరు చేసి పంపిన కర్మలకు ప్రతిఫలంగా, ఇప్పుడు మీరు హాయిగా తినండి మరియు త్రాగండి

Verse 25 — Surah Al-Haqqah 69:25

ఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: "అయ్యో! నా పాడుగాను! నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది

Verse 26 — Surah Al-Haqqah 69:26

మరియు నా లెక్క ఏమిటో నాకు తెలియకుంటే ఎంత బాగండేది

Verse 27 — Surah Al-Haqqah 69:27

అయ్యో! నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది

Verse 28 — Surah Al-Haqqah 69:28

నా సంపద నాకేమీ పనికి రాలేదు

Verse 29 — Surah Al-Haqqah 69:29

నా అధికారమంతా అంతమై పోయింది

Verse 30 — Surah Al-Haqqah 69:30

(అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): "అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి

Verse 31 — Surah Al-Haqqah 69:31

తరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి

Verse 32 — Surah Al-Haqqah 69:32

ఆ తరువాత అతనిని డెబ్భై మూరల పొడవు గల గొలుసుతో బంధించండి

Verse 33 — Surah Al-Haqqah 69:33

వాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు

Verse 34 — Surah Al-Haqqah 69:34

మరియు నిరుపేదలకు ఆహారం పెట్టమని ప్రోత్సహించేవాడు కాదు

Verse 35 — Surah Al-Haqqah 69:35

కావున, ఈనాడు అతనికి ఇక్కడ ఏ స్నేహితుడూ లేడు

Verse 36 — Surah Al-Haqqah 69:36

మరియు అసహ్యకరమైన గాయాల కడుగు తప్ప, మరొక ఆహారమూ లేదు

Verse 37 — Surah Al-Haqqah 69:37

దానిని పాపులు తప్ప మరెవ్వరూ తినరు

Verse 38 — Surah Al-Haqqah 69:38

కావున, నేను మీరు చూడగలిగే వాటి శపథం చేస్తున్నాను

Verse 39 — Surah Al-Haqqah 69:39

మరియు మీరు చూడలేనట్టని వాటి (శపథం) కూడా

Verse 40 — Surah Al-Haqqah 69:40

నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుని (పై అవతరింప జేయబడిన) వాక్కు

Verse 41 — Surah Al-Haqqah 69:41

మరియు ఇది ఒక కవి యొక్క వాక్కు కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ

Verse 42 — Surah Al-Haqqah 69:42

మరియు ఇది ఏ జ్యాతిష్యుని వాక్కు కూడా కాదు! మీరు గ్రహించేది చాలా తక్కువ

Verse 43 — Surah Al-Haqqah 69:43

ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది

Verse 44 — Surah Al-Haqqah 69:44

ఒకవేళ ఇతను (ఈ ప్రవక్త), మా (అల్లాహ్ ను) గురించి ఏదైనా అబద్ధపు మాట కల్పించి ఉంటే

Verse 45 — Surah Al-Haqqah 69:45

మేము అతని కుడి చేతిని పట్టుకునే వారం

Verse 46 — Surah Al-Haqqah 69:46

తరువాత అతని (మెడ) రక్తనాళాన్ని కోసేవారం

Verse 47 — Surah Al-Haqqah 69:47

అప్పుడు మీలో నుండి ఏ ఒక్కడు కూడా అతనిని (మా శిక్ష నుండి) కాపాడ లేక పోయేవాడు

Verse 48 — Surah Al-Haqqah 69:48

మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) దైవభీతి గల వారికొక హితోపదేశం

Verse 49 — Surah Al-Haqqah 69:49

మరియు నిశ్చయంగా మీలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని అనేవారు ఉన్నారని మాకు బాగా తెలుసు

Verse 50 — Surah Al-Haqqah 69:50

మరియు నిశ్చయంగా, ఇది (ఈ తిరస్కారం) సత్యతిరస్కారులకు దుఃఖ కారణమవుతుంది

Verse 51 — Surah Al-Haqqah 69:51

మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నమ్మదగిన సత్యం

Verse 52 — Surah Al-Haqqah 69:52

కావున నీవు సర్వోత్తముడైన నీ ప్రభువు పవిత్ర నామాన్ని స్తుతించు