Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 70 - Al-Maarij
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah Al-Maarij 70:1
ప్రశ్నించేవాడు, ఆ అనివార్యమైన శిక్షను గురించి ప్రశ్నించాడు
Verse 2 — Surah Al-Maarij 70:2
సత్యతిరస్కారులకు విధించబడే దాని గురించి; దానిని ఎవ్వడూ తొలగించలేడు
Verse 3 — Surah Al-Maarij 70:3
అది ఆరోహణ మార్గాలకు యజమానుడైన అల్లాహ్ తరఫు నుండి వస్తుంది
Verse 4 — Surah Al-Maarij 70:4
యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో, దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్) ఆయన వద్దకు అధిరోహిస్తారు
Verse 5 — Surah Al-Maarij 70:5
కావున (ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు, ఉత్తమమైన సహనంతో
Verse 6 — Surah Al-Maarij 70:6
వాస్తవానికి, వారు (ప్రజలు) అది (ఆ దినం) దూరంగా ఉందని అనుకుంటున్నారు
Verse 7 — Surah Al-Maarij 70:7
కాని మాకది అతి దగ్గరలో కనిపిస్తోంది
Verse 8 — Surah Al-Maarij 70:8
ఆ రోజు ఆకాశం మరిగే సీసం వలే (నూనే వలే) అయి పోతుంది
Verse 9 — Surah Al-Maarij 70:9
మరియు కొండలు ఏకిన ఉన్ని వలె అయి పోతాయి
Verse 10 — Surah Al-Maarij 70:10
మరియు ప్రాణ స్నేహితుడు కూడా తన స్నేహితుని (క్షేమాన్ని) అడగడు
Verse 11 — Surah Al-Maarij 70:11
వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ రోజు అపరాధి తన సంతానాన్ని పరిహారంగా ఇచ్చి అయినా శిక్ష నుండి తప్పించుకోగోరుతాడు
Verse 12 — Surah Al-Maarij 70:12
మరియు తన సహవాసిని మరియు తన సోదరుణ్ణి
Verse 13 — Surah Al-Maarij 70:13
మరియు తనకు ఆశ్రయమిచ్చిన దగ్గరి బంధువులను
Verse 14 — Surah Al-Maarij 70:14
మరియు భూమిలో ఉన్న వారినందరినీ కూడా ఇచ్చి అయినా, తాను విముక్తి పొందాలని కోరుతాడు
Verse 15 — Surah Al-Maarij 70:15
కాని అలా కానేరదు! నిశ్చయంగా, ఆ మండే అగ్నిజ్వాల (అతని కొరకు వేచి ఉంటుంది)
Verse 16 — Surah Al-Maarij 70:16
అది అతని చర్మాన్ని పూర్తిగా వలచి కాల్చి వేస్తుంది
Verse 17 — Surah Al-Maarij 70:17
అది (సత్యం నుండి) వెనుదిరిగి మరియు వెన్ను చూపి, పోయేవారిని (అందరినీ) పిలుస్తుంది
Verse 18 — Surah Al-Maarij 70:18
మరియు (ధనాన్ని) కూడబెట్టి, దానిని దాచేవారిని
Verse 19 — Surah Al-Maarij 70:19
నిశ్చయంగా, మానవుడు ఆత్రగాడుగా (తొందరపడేవాడిగా) సృష్టించబడ్డాడు
Verse 20 — Surah Al-Maarij 70:20
తనకు కీడు కలిగినప్పుడు వాడు ఆందోళన చెందుతాడు
Verse 21 — Surah Al-Maarij 70:21
మరియు తనకు మేలు కలిగినపుడు స్వార్థపరునిగా ప్రవర్తిస్తాడు
Verse 22 — Surah Al-Maarij 70:22
నమాజ్ ను ఖచ్ఛితంగా పాఠించేవారు తప్ప
Verse 23 — Surah Al-Maarij 70:23
ఎవరైతే తమ నమాజ్ ను సదా నియమంతో పాటిస్తారో
Verse 24 — Surah Al-Maarij 70:24
మరియు అలాంటి వారు, ఎవరైతే తమ సంపదలలో (ఇతరులకు) ఉన్న హక్కును సమ్మతిస్తారో
Verse 25 — Surah Al-Maarij 70:25
యాచకులకు మరియు లేమికి గురి అయిన వారికి
Verse 26 — Surah Al-Maarij 70:26
మరియు అలాంటి వారికి, ఎవరైతే తీర్పుదినాన్ని సత్యమని నమ్ముతారో
Verse 27 — Surah Al-Maarij 70:27
మరియు ఎవరైతే తమ ప్రభువు శిక్షకు భయపడుతారో
Verse 28 — Surah Al-Maarij 70:28
నిశ్చయంగా, వారి ప్రభువు యొక్క ఆ శిక్ష; దాని పట్ల ఎవ్వరూ నిర్భయంగా ఉండలేరు
Verse 29 — Surah Al-Maarij 70:29
మరియు ఎవరైతే, తమ మర్మాంగాలను కాపాడుకుంటారో
Verse 30 — Surah Al-Maarij 70:30
తమ భార్యలు (అజ్వాజ్), లేదా ధర్మసమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప - అలాంటప్పుడు వారు నిందార్హులు కారు
Verse 31 — Surah Al-Maarij 70:31
కాని ఎవరైతే వీటిని మించి పోగోరుతారో, అలాంటివారే మితిమీరి పోయేవారు
Verse 32 — Surah Al-Maarij 70:32
మరియు ఎవరైతే తమ అమానతులను మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో
Verse 33 — Surah Al-Maarij 70:33
మరియు ఎవరైతే తమ సాక్ష్యాల మీద స్థిరంగా ఉంటారో
Verse 34 — Surah Al-Maarij 70:34
మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో
Verse 35 — Surah Al-Maarij 70:35
ఇలాంటి వారంతా సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు
Verse 36 — Surah Al-Maarij 70:36
ఈ సత్యతిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు
Verse 37 — Surah Al-Maarij 70:37
కుడి ప్రక్క నుండి మరియు ఎడమ ప్రక్క నుండి గుంపులుగా
Verse 38 — Surah Al-Maarij 70:38
ఏమీ? వారిలో ప్రతి ఒక్కడూ, తాను పరమ సుఖాలు గల స్వర్గవనంలో ప్రవేశింప జేయబడతానని ఆశిస్తున్నాడా
Verse 39 — Surah Al-Maarij 70:39
అలా కానేరదు! నిశ్చయంగా, మేము వారిని దేనితో పుట్టించామో వారికి బాగా తెలుసు
Verse 40 — Surah Al-Maarij 70:40
కావున! నేను తూర్పుల మరియు పడమరల ప్రభువు శపథం చేసి చెబుతున్నాను. నిశ్చయంగా, మేము అలా చేయగల సమర్థులము
Verse 41 — Surah Al-Maarij 70:41
వారికి బదులుగా వారి కంటే ఉత్తమమైన వారిని వారి స్థానంలో తీసుకురావటానికి; మరియు మమ్మల్ని మించి పోయేవారు ఎవ్వరూ లేరు
Verse 42 — Surah Al-Maarij 70:42
కావున వారిని - వారితో వాగ్దానం చేయబడిన ఆ దినానికి చేరే వరకు - వ్యర్థపు మాటలలో మరియు విలాస వినోదాల్లో విడిచిపెట్టు
Verse 43 — Surah Al-Maarij 70:43
ఆ రోజు వారు తమ సమాధుల నుండి లేచి, తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి తొందర పడుతూ వేగంగా బయటికి వస్తారు
Verse 44 — Surah Al-Maarij 70:44
వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, అవమానం వారిని క్రమ్ముకొని ఉంటుంది. అదే వారికి వాగ్దానం చేయబడిన దినం