Back to Languages

Telugu - Chapter 71 - Nuh

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Nuh 71:1

నిశ్చయంగా, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు: "వారిపై బాధాకరమైన శిక్ష రాకముందే వారిని హెచ్చరించు!" అని (ఆజ్ఞాపించి) పంపాము

Verse 2 — Surah Nuh 71:2

అతను వారితో ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! నిశ్చయంగా, నేను మీకు స్పష్టంగా హెచ్చరిక చేయటానికి వచ్చిన వాడిని

Verse 3 — Surah Nuh 71:3

కావున మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి

Verse 4 — Surah Nuh 71:4

అలా చేస్తే ఆయన మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఒక నియమిత కాలం వరకు మిమ్మల్ని వదలి పెడ్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ నిర్ణయించిన కాలం వచ్చినపుడు, దానిని తప్పించడం సాధ్యం కాదు. ఇది మీరు తెలుసుకుంటే ఎంత బాగుండేది

Verse 5 — Surah Nuh 71:5

అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నేను నా జాతివారిని రేయింబవళ్ళు పిలిచాను

Verse 6 — Surah Nuh 71:6

కాని, నా పిలుపు, వారి పలాయనాన్ని మాత్రమే హెచ్చించింది

Verse 7 — Surah Nuh 71:7

మరియు వాస్తవానికి, నేను వారిని, నీ క్షమాభిక్ష వైపునకు పిలిచినప్పుడల్లా, వారు తమ చెవులలో వ్రేళ్ళు దూర్చుకునేవారు మరియు తమ వస్త్రాలను తమపై కప్పుకునేవారు మరియు వారు మొండి వైఖరి అవలంబిస్తూ దురహంకారంలో మునిగి ఉండేవారు

Verse 8 — Surah Nuh 71:8

తరువాత వాస్తవానికి, నేను వారిని ఎలుగెత్తి పిలిచాను

Verse 9 — Surah Nuh 71:9

ఆ తరువాత వాస్తవంగా, నేను వారికి బహిరంగంగా చాటి చెప్పాను మరియు ఏకాంతంలో రహస్యంగా పిలిచాను

Verse 10 — Surah Nuh 71:10

ఇంకా వారితో ఇలా అన్నాను: 'మీ ప్రభువును క్షమాపణకై వేడుకోండి, నిశ్చయంగా ఆయన ఎంతో క్షమాశీలుడు

Verse 11 — Surah Nuh 71:11

ఆయన మీపై ఆకాశం నుండి ధారాళంగా వర్షాన్ని కురిపింపజేస్తాడు

Verse 12 — Surah Nuh 71:12

మరియు మీకు ధన సంపదలలోను మరియు సంతానంలోను వృద్ధి నొసంగుతాడు మరియు మీ కొరకు తోటలను ఉత్పత్తి చేస్తాడు. మరియు నదులను ప్రవహింపజేస్తాడు

Verse 13 — Surah Nuh 71:13

మీకేమయింది? మీరు అల్లాహ్ మహత్త్వమును ఎందుకు ఆదరించరు

Verse 14 — Surah Nuh 71:14

మరియు వాస్తవానికి ఆయనే మిమ్మల్ని విభిన్న దశలలో సృష్టించాడు

Verse 15 — Surah Nuh 71:15

ఏమీ? మీరు చూడటం లేదా? అల్లాహ్ ఏడు ఆకాశాలను ఏ విధంగా అంతస్తులలో సృష్టించాడో

Verse 16 — Surah Nuh 71:16

మరియు వాటి మధ్య చంద్రుణ్ణి (ప్రతిబింబించే) కాంతిగాను మరియు సూర్యుణ్ణి (వెలిగే) దీపం గాను చేశాడు

Verse 17 — Surah Nuh 71:17

మరియు అల్లాహ్ యే మిమ్మల్ని భూమి (మట్టి) నుండి ఉత్పత్తి చేశాడు

Verse 18 — Surah Nuh 71:18

తరువాత ఆయన మిమ్మల్ని అందులోకే తీసుకొని పోతాడు మరియు మిమ్మల్ని దాని నుండి (బ్రతికించి) బయటికి తీస్తాడు

Verse 19 — Surah Nuh 71:19

మరియు అల్లాహ్ యే మీ కొరకు భూమిని విస్తరింపజేశాడు

Verse 20 — Surah Nuh 71:20

మీరు దానిపై నున్న విశాలమైన మార్గాలలో నడవటానికి

Verse 21 — Surah Nuh 71:21

నూహ్ ఇంకా ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! వాస్తవానికి వారు నా మాటను ధిక్కరించారు. మరియు వాడిని అనుసరించారు, ఎవడి సంపద మరియు సంతానం వారికి కేవలం నష్టం తప్ప మరేమీ అధికం చేయదో

Verse 22 — Surah Nuh 71:22

మరియు వారు పెద్ద కుట్ర పన్నారు

Verse 23 — Surah Nuh 71:23

మరియు వారు ఒకరితోనొకరు ఇలా అనుకున్నారు: 'మీరు మీ ఆరాధ్యదైవాలను విడిచి పెట్టకండి. వద్ద్ మరియు సువాఅ; యగూస్, యఊఖ్ మరియు నస్ర్ లను విడిచిపెట్టకండి

Verse 24 — Surah Nuh 71:24

మరియు వాస్తవానికి, వారు చాలా మందిని తప్పు దారిలో పడవేశారు. కావున (ఓ నా ప్రభూ!) : నీవు కూడా ఈ దుర్మార్గులకు కేవలం వారి మార్గభ్రష్టత్వాన్నే హెచ్చించు

Verse 25 — Surah Nuh 71:25

వారు తమ పాపాల కారణంగా ముంచి వేయబడ్డారు మరియు నరకాగ్నిలోకి త్రోయబడ్డారు, కావున వారు అల్లాహ్ తప్ప తమను కాపాడే వారినెవ్వరినీ పొందలేక పోయారు

Verse 26 — Surah Nuh 71:26

మరియు నూహ్ ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! సత్యతిరస్కారులలో ఒక్కరిని కూడా భూమి మీద వదలకు

Verse 27 — Surah Nuh 71:27

ఒకవేళ నీవు వారిని వదలి పెడితే, నిశ్చయంగా వారు నీ దాసులను మార్గభ్రష్టత్వంలో పడవేస్తారు. మరియు వారు పాపులను మరియు కృతఘ్నులను మాత్రమే పుట్టిస్తారు

Verse 28 — Surah Nuh 71:28

ఓ మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను మరియు విశ్వాసిగా నా ఇంటిలోనికి ప్రవేశించిన వానిని మరియు విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను, అందరినీ క్షమించు. మరియు దుర్మార్గులకు వినాశం తప్ప మరేమీ అధికం చేయకు