(ఓ ప్రవక్తా!) ఇలా అను: "నాకు ఈ విధంగా దివ్యసందేశం పంపబడింది; నిశ్చయంగా, ఒక జిన్నాతుల సమూహం - దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విని - తమ జాతి వారితో ఇలా అన్నారు: 'వాస్తవానికి మేము ఒక అద్భుతమైన పఠనం (ఖుర్ఆన్) విన్నాము
మరియు వాస్తవానికి, మానవులలో నుండి కొందరు పురుషులు, జిన్నాతులలో నుండి కొందరు పురుషుల శరణు వేడుతూ ఉండేవారు. ఈ విధంగా వారు, వారి (జిన్నాతుల) తలబిరుసుతనం మరింత అధికమే చేసేవారు
మరియు నిశ్చయంగా, మేము ఆకాశాలలో (రహస్యాలను) తొంగి చూడటానికి ప్రయత్నించినపుడు, మేము దానిని కఠినమైన కావలివారితో మరియు అగ్ని జ్వాలలతో నిండి ఉండటాన్ని చూశాము
మరియు వాస్తవానికి పూర్వం అక్కడి మాటలు వినటానికి మేము రహస్యంగా అక్కడ కూర్చునేవారం. కాని ఇప్పుడు ఎవడైనా (రహస్యంగా) వినే ప్రయత్నం చేస్తే, అతడి కొరకు అక్కడ ఒక అగ్నిజ్వాల పొంచి ఉంటుంది
మరియు నిశ్చయంగా, మేము ఈ మార్గదర్శకత్వాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు దానిని విశ్వసించాము. కావున ఎవడైనా తన ప్రభువును విశ్వసిస్తాడో అతడికి తన సత్కర్మల ఫలితంలో నష్టాన్ని గురించీ మరియు శిక్షలో హెచ్చింపును గురించీ భయపడే అవసరం ఉండదు
మరియు నిశ్చయంగా, మనలో కొందరు అల్లాహ్ కు విధేయులైన వారు (ముస్లింలు) ఉన్నారు. మరికొందరు నిశ్చయంగా, అన్యాయపరులు (సత్యానికి దూరమైన వారు) ఉన్నారు. కావున ఎవరైతే అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) ను అవలంబించారో, అలాంటి వారే సరైన మార్గాన్ని కనుగొన్న వారు
మరియు నిశ్చయంగా, అల్లాహ్ యొక్క దాసుడు (ముహమ్మద్) ఆయన (అల్లాహ్)ను ప్రార్థించటానికి నిలబడి నప్పుడు, వారు (జిన్నాతులు) అతన చుట్టు దట్టంగా (అతని ఖుర్ఆన్ పఠనాన్ని వినటానికి) గుమి గూడుతారు
(నా పని) కేవలం అల్లాహ్ ఉపదేశాన్ని మరియు ఆయన సందేశాన్ని అందజేయటమే!" ఇక ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘిస్తాడో! అతడు నిశ్చయంగా, నరకాగ్నికి గురి అవుతాడు; అందులో శాశ్వతంగా కలకాలం ఉంటాడు
వారు, (ప్రవక్తలు) తమ ప్రభువు యొక్క సందేశాలను యథాతథంగా అందజేస్తున్నారని పరిశీలించడానికి. మరియు ఆయన వారి అన్ని విషయాలను పరివేష్టించి ఉన్నాడు మరియు ఆయన ప్రతి ఒక్క విషయాన్ని లెక్క పెట్టి ఉంచుతాడు