Back to Languages

Telugu - Chapter 74 - Al-Muddaththir

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Al-Muddaththir 74:1

ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా

Verse 2 — Surah Al-Muddaththir 74:2

లే! ఇక హెచ్చరించు

Verse 3 — Surah Al-Muddaththir 74:3

మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)

Verse 4 — Surah Al-Muddaththir 74:4

మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో

Verse 5 — Surah Al-Muddaththir 74:5

మరియు మాలిన్యానికి దూరంగా ఉండు

Verse 6 — Surah Al-Muddaththir 74:6

మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)

Verse 7 — Surah Al-Muddaththir 74:7

మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు

Verse 8 — Surah Al-Muddaththir 74:8

మరియు బాకా (నాఖూర్) ఊదబడినప్పుడు

Verse 9 — Surah Al-Muddaththir 74:9

ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది

Verse 10 — Surah Al-Muddaththir 74:10

సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు

Verse 11 — Surah Al-Muddaththir 74:11

వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ

Verse 12 — Surah Al-Muddaththir 74:12

మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను

Verse 13 — Surah Al-Muddaththir 74:13

మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను

Verse 14 — Surah Al-Muddaththir 74:14

మరియు అతను కొరకు అతని జీవన సౌకర్యాలను సులభం చేశాను

Verse 15 — Surah Al-Muddaththir 74:15

అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు

Verse 16 — Surah Al-Muddaththir 74:16

అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు

Verse 17 — Surah Al-Muddaththir 74:17

నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను

Verse 18 — Surah Al-Muddaththir 74:18

వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు

Verse 19 — Surah Al-Muddaththir 74:19

కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురి కానివ్వండి

Verse 20 — Surah Al-Muddaththir 74:20

అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి

Verse 21 — Surah Al-Muddaththir 74:21

అప్పుడు అతడు ఆలోచించాడు

Verse 22 — Surah Al-Muddaththir 74:22

తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు)

Verse 23 — Surah Al-Muddaththir 74:23

తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు

Verse 24 — Surah Al-Muddaththir 74:24

అప్పుడు అతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే

Verse 25 — Surah Al-Muddaththir 74:25

ఇది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే

Verse 26 — Surah Al-Muddaththir 74:26

త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను

Verse 27 — Surah Al-Muddaththir 74:27

మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు

Verse 28 — Surah Al-Muddaththir 74:28

అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు

Verse 29 — Surah Al-Muddaththir 74:29

అది మానవుణ్ణి (అతడి చర్మాన్నిదహించి వేస్తుంది)

Verse 30 — Surah Al-Muddaththir 74:30

దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు

Verse 31 — Surah Al-Muddaththir 74:31

మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే

Verse 32 — Surah Al-Muddaththir 74:32

అలా కాదు! చంద్రుని సాక్షిగా

Verse 33 — Surah Al-Muddaththir 74:33

గడిచిపోయే రాత్రి సాక్షిగా

Verse 34 — Surah Al-Muddaththir 74:34

ప్రకాశించే, ఉదయం సాక్షిగా

Verse 35 — Surah Al-Muddaththir 74:35

నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం

Verse 36 — Surah Al-Muddaththir 74:36

మానవునికి ఒక హెచ్చరిక

Verse 37 — Surah Al-Muddaththir 74:37

మీలో ముందుకు రావాలని కోరుకునే వానికి లేదా వెనుక ఉండి పోయేవానికి

Verse 38 — Surah Al-Muddaththir 74:38

ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు

Verse 39 — Surah Al-Muddaththir 74:39

కుడిపక్షం వారు తప్ప

Verse 40 — Surah Al-Muddaththir 74:40

వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు

Verse 41 — Surah Al-Muddaththir 74:41

అపరాధులను గురించి (మరియు వారితో అంటారు)

Verse 42 — Surah Al-Muddaththir 74:42

మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది

Verse 43 — Surah Al-Muddaththir 74:43

వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము

Verse 44 — Surah Al-Muddaththir 74:44

మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము

Verse 45 — Surah Al-Muddaththir 74:45

మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము

Verse 46 — Surah Al-Muddaththir 74:46

మరియు తీర్పుదినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్ళము

Verse 47 — Surah Al-Muddaththir 74:47

చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది

Verse 48 — Surah Al-Muddaththir 74:48

అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు

Verse 49 — Surah Al-Muddaththir 74:49

అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు

Verse 50 — Surah Al-Muddaththir 74:50

వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది

Verse 51 — Surah Al-Muddaththir 74:51

సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)

Verse 52 — Surah Al-Muddaththir 74:52

అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు

Verse 53 — Surah Al-Muddaththir 74:53

కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు

Verse 54 — Surah Al-Muddaththir 74:54

అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం

Verse 55 — Surah Al-Muddaththir 74:55

కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు

Verse 56 — Surah Al-Muddaththir 74:56

కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు