Back to Languages

Telugu - Chapter 77 - Al-Mursalat

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Al-Mursalat 77:1

ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా

Verse 2 — Surah Al-Mursalat 77:2

మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా

Verse 3 — Surah Al-Mursalat 77:3

మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా

Verse 4 — Surah Al-Mursalat 77:4

మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా

Verse 5 — Surah Al-Mursalat 77:5

సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా

Verse 6 — Surah Al-Mursalat 77:6

సాకుగా లేక హెచ్చరికగా

Verse 7 — Surah Al-Mursalat 77:7

నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది

Verse 8 — Surah Al-Mursalat 77:8

అప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో

Verse 9 — Surah Al-Mursalat 77:9

మరియు ఆకాశం చీలిపోతుందో

Verse 10 — Surah Al-Mursalat 77:10

మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో

Verse 11 — Surah Al-Mursalat 77:11

మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో

Verse 12 — Surah Al-Mursalat 77:12

ఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి

Verse 13 — Surah Al-Mursalat 77:13

ఆ తీర్పుదినం కొరకా

Verse 14 — Surah Al-Mursalat 77:14

మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు

Verse 15 — Surah Al-Mursalat 77:15

ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది

Verse 16 — Surah Al-Mursalat 77:16

ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా

Verse 17 — Surah Al-Mursalat 77:17

తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము

Verse 18 — Surah Al-Mursalat 77:18

ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము

Verse 19 — Surah Al-Mursalat 77:19

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది

Verse 20 — Surah Al-Mursalat 77:20

ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా

Verse 21 — Surah Al-Mursalat 77:21

తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము

Verse 22 — Surah Al-Mursalat 77:22

ఒక నిర్ణీత కాలం వరకు

Verse 23 — Surah Al-Mursalat 77:23

ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము

Verse 24 — Surah Al-Mursalat 77:24

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది

Verse 25 — Surah Al-Mursalat 77:25

ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా

Verse 26 — Surah Al-Mursalat 77:26

జీవులకూ మరియు మృతులకూను

Verse 27 — Surah Al-Mursalat 77:27

మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా

Verse 28 — Surah Al-Mursalat 77:28

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది

Verse 29 — Surah Al-Mursalat 77:29

(సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): "మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి

Verse 30 — Surah Al-Mursalat 77:30

(దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి

Verse 31 — Surah Al-Mursalat 77:31

కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు

Verse 32 — Surah Al-Mursalat 77:32

వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది

Verse 33 — Surah Al-Mursalat 77:33

వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి

Verse 34 — Surah Al-Mursalat 77:34

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది

Verse 35 — Surah Al-Mursalat 77:35

ఆ దినాన వారు మాట్లాడలేరు

Verse 36 — Surah Al-Mursalat 77:36

మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు

Verse 37 — Surah Al-Mursalat 77:37

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది

Verse 38 — Surah Al-Mursalat 77:38

అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము

Verse 39 — Surah Al-Mursalat 77:39

కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి

Verse 40 — Surah Al-Mursalat 77:40

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది

Verse 41 — Surah Al-Mursalat 77:41

నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు

Verse 42 — Surah Al-Mursalat 77:42

మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి

Verse 43 — Surah Al-Mursalat 77:43

(వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి

Verse 44 — Surah Al-Mursalat 77:44

నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము

Verse 45 — Surah Al-Mursalat 77:45

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది

Verse 46 — Surah Al-Mursalat 77:46

(ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు

Verse 47 — Surah Al-Mursalat 77:47

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది

Verse 48 — Surah Al-Mursalat 77:48

మరియు వారితో: "(అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు

Verse 49 — Surah Al-Mursalat 77:49

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది

Verse 50 — Surah Al-Mursalat 77:50

దీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్నివిశ్వసిస్తారు