Back to Languages

Telugu - Chapter 78 - An-Naba

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah An-Naba 78:1

ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు

Verse 2 — Surah An-Naba 78:2

ఆ మహా వార్తను గురించేనా

Verse 3 — Surah An-Naba 78:3

దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో

Verse 4 — Surah An-Naba 78:4

అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు

Verse 5 — Surah An-Naba 78:5

ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు

Verse 6 — Surah An-Naba 78:6

ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా

Verse 7 — Surah An-Naba 78:7

మరియు పర్వతాలను మేకులుగా

Verse 8 — Surah An-Naba 78:8

మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము

Verse 9 — Surah An-Naba 78:9

మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము

Verse 10 — Surah An-Naba 78:10

మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము

Verse 11 — Surah An-Naba 78:11

మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము

Verse 12 — Surah An-Naba 78:12

మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము

Verse 13 — Surah An-Naba 78:13

మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము

Verse 14 — Surah An-Naba 78:14

మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము

Verse 15 — Surah An-Naba 78:15

దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి

Verse 16 — Surah An-Naba 78:16

మరియు దట్టమైన తోటలను

Verse 17 — Surah An-Naba 78:17

నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం

Verse 18 — Surah An-Naba 78:18

ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు

Verse 19 — Surah An-Naba 78:19

మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి

Verse 20 — Surah An-Naba 78:20

మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి

Verse 21 — Surah An-Naba 78:21

నిశ్చయంగా, నరకం ఒక మాటు

Verse 22 — Surah An-Naba 78:22

ధిక్కారుల గమ్యస్థానం

Verse 23 — Surah An-Naba 78:23

అందులో వారు యుగాల తరబడి ఉంటారు

Verse 24 — Surah An-Naba 78:24

అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు

Verse 25 — Surah An-Naba 78:25

సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప

Verse 26 — Surah An-Naba 78:26

(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా

Verse 27 — Surah An-Naba 78:27

వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు

Verse 28 — Surah An-Naba 78:28

పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు

Verse 29 — Surah An-Naba 78:29

మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము

Verse 30 — Surah An-Naba 78:30

కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము

Verse 31 — Surah An-Naba 78:31

నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది

Verse 32 — Surah An-Naba 78:32

ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ

Verse 33 — Surah An-Naba 78:33

మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు

Verse 34 — Surah An-Naba 78:34

మరియు నిండి పొర్లే (మధు) పాత్ర

Verse 35 — Surah An-Naba 78:35

అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు

Verse 36 — Surah An-Naba 78:36

(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం

Verse 37 — Surah An-Naba 78:37

భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు

Verse 38 — Surah An-Naba 78:38

ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు

Verse 39 — Surah An-Naba 78:39

అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి

Verse 40 — Surah An-Naba 78:40

నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు