Back to Languages

Telugu - Chapter 80 - Abasa

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Abasa 80:1

అతను (ప్రవక్త) భృకుటి ముడి వేసుకున్నాడు మరియు ముఖం త్రిప్పుకున్నాడు

Verse 2 — Surah Abasa 80:2

ఆ గ్రుడ్డివాడు తన వద్దకు వచ్చాడని

Verse 3 — Surah Abasa 80:3

కాని నీకేం తెలుసు? బహుశా అతడు తనను తాను సంస్కరించుకోవచ్చు

Verse 4 — Surah Abasa 80:4

లేదా అతడు హితబోధ పొందవచ్చు మరియు ఆ హితబోధ అతనికి ప్రయోజనకరం కావచ్చు

Verse 5 — Surah Abasa 80:5

కాని అతడు, ఎవడైతే తనను తాను స్వయం సమృద్ధుడు, అనుకుంటున్నాడో

Verse 6 — Surah Abasa 80:6

అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు

Verse 7 — Surah Abasa 80:7

ఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది

Verse 8 — Surah Abasa 80:8

కాని, ఎవడైతే తనంతట తాను, నీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడో

Verse 9 — Surah Abasa 80:9

మరియు (అల్లాహ్ యెడల) భీతిపరుడై ఉన్నాడో

Verse 10 — Surah Abasa 80:10

అతనిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు

Verse 11 — Surah Abasa 80:11

అలా కాదు! నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) ఒక హితోపదేశం

Verse 12 — Surah Abasa 80:12

కావున ఇష్టమున్నవారు దీనిని స్వీకరించవచ్చు

Verse 13 — Surah Abasa 80:13

ఇది ప్రతిష్ఠాకరమైన పుటలలో (వ్రాయబడి ఉన్నది)

Verse 14 — Surah Abasa 80:14

మహోన్నతమైనది, పవిత్రమైనది

Verse 15 — Surah Abasa 80:15

లేఖకుల (దేవదూతల) చేతులలో

Verse 16 — Surah Abasa 80:16

వారు గౌరవనీయులైన సత్పురుషులు (ఆజ్ఞానువర్తనులు)

Verse 17 — Surah Abasa 80:17

మానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు

Verse 18 — Surah Abasa 80:18

ఆయన (అల్లాహ్) దేనితో అతనిని సృష్టించాడు

Verse 19 — Surah Abasa 80:19

అతనిని వీర్యబిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు

Verse 20 — Surah Abasa 80:20

ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు

Verse 21 — Surah Abasa 80:21

ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు

Verse 22 — Surah Abasa 80:22

మళ్ళీ ఆయన (అల్లాహ్) కోరినప్పుడు అతనిని తిరిగి బ్రతికించి లేపాడు

Verse 23 — Surah Abasa 80:23

అలా కాదు, ఆయన (అల్లాహ్) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు

Verse 24 — Surah Abasa 80:24

ఇక, మానవుడు తన ఆహారాన్ని గమనించాలి

Verse 25 — Surah Abasa 80:25

నిశ్చయంగా మేము నీటిని (వర్షాన్ని) ఎంత పుష్కలంగా కురిపించాము

Verse 26 — Surah Abasa 80:26

ఆ తరువాత భూమిని (మొలిచే మొక్కలతో) చీల్చాము, ఒక అద్భుతమైన చీల్పుతో

Verse 27 — Surah Abasa 80:27

తరువాత దానిలో ధాన్యాన్ని పెంచాము

Verse 28 — Surah Abasa 80:28

మరియు ద్రాక్షలను మరియు కూరగాయలను

Verse 29 — Surah Abasa 80:29

మరియు ఆలివ్ (జైతూన్) మరియు ఖర్జూరపు చెట్లను

Verse 30 — Surah Abasa 80:30

మరియు దట్టమైన తోటలను

Verse 31 — Surah Abasa 80:31

మరియు (రకరకాల) పండ్లను మరియు పచ్చికలను

Verse 32 — Surah Abasa 80:32

మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా

Verse 33 — Surah Abasa 80:33

ఎప్పుడైతే, చెవులను చెవిటిగా చేసే ఆ గొప్ప ధ్వని వస్తుందో

Verse 34 — Surah Abasa 80:34

ఆ రోజు, మానవుడు తన సోదరుని నుండి దూరంగా పారిపోతాడు

Verse 35 — Surah Abasa 80:35

మరియు తన తల్లి నుండి మరియు తండ్రి నుండి

Verse 36 — Surah Abasa 80:36

మరియు తన భార్య (సాహిబతి) నుండి మరియు తన సంతానం నుండి

Verse 37 — Surah Abasa 80:37

ఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది

Verse 38 — Surah Abasa 80:38

ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి

Verse 39 — Surah Abasa 80:39

అవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంటాయి

Verse 40 — Surah Abasa 80:40

మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి

Verse 41 — Surah Abasa 80:41

అవి నల్లగా మాడిపోయి ఉంటాయి

Verse 42 — Surah Abasa 80:42

అలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు