Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 81 - At-Takwir
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah At-Takwir 81:1
సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు
Verse 2 — Surah At-Takwir 81:2
మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు
Verse 3 — Surah At-Takwir 81:3
మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు
Verse 4 — Surah At-Takwir 81:4
మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు
Verse 5 — Surah At-Takwir 81:5
మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు
Verse 6 — Surah At-Takwir 81:6
మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు
Verse 7 — Surah At-Takwir 81:7
మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు
Verse 8 — Surah At-Takwir 81:8
మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు
Verse 9 — Surah At-Takwir 81:9
ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని
Verse 10 — Surah At-Takwir 81:10
మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు
Verse 11 — Surah At-Takwir 81:11
మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు
Verse 12 — Surah At-Takwir 81:12
మరియు నరకాగ్ని మండించబడినప్పుడు
Verse 13 — Surah At-Takwir 81:13
మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు
Verse 14 — Surah At-Takwir 81:14
ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది
Verse 15 — Surah At-Takwir 81:15
అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను
Verse 16 — Surah At-Takwir 81:16
(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో
Verse 17 — Surah At-Takwir 81:17
మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా
Verse 18 — Surah At-Takwir 81:18
మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా
Verse 19 — Surah At-Takwir 81:19
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు
Verse 20 — Surah At-Takwir 81:20
అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు
Verse 21 — Surah At-Takwir 81:21
అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు
Verse 22 — Surah At-Takwir 81:22
మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు
Verse 23 — Surah At-Takwir 81:23
మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు
Verse 24 — Surah At-Takwir 81:24
మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు
Verse 25 — Surah At-Takwir 81:25
మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు
Verse 26 — Surah At-Takwir 81:26
మరి మీరు ఎటు పోతున్నారు
Verse 27 — Surah At-Takwir 81:27
ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం
Verse 28 — Surah At-Takwir 81:28
మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు
Verse 29 — Surah At-Takwir 81:29
మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు