Back to Languages

Telugu - Chapter 82 - Al-Infitar

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Al-Infitar 82:1

ఆకాశం చీల్చబడినప్పుడు

Verse 2 — Surah Al-Infitar 82:2

మరియు నక్షత్రాలు చెదిరి పోయినప్పుడు

Verse 3 — Surah Al-Infitar 82:3

మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు

Verse 4 — Surah Al-Infitar 82:4

మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు

Verse 5 — Surah Al-Infitar 82:5

ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది

Verse 6 — Surah Al-Infitar 82:6

ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది

Verse 7 — Surah Al-Infitar 82:7

ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు

Verse 8 — Surah Al-Infitar 82:8

తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు

Verse 9 — Surah Al-Infitar 82:9

అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు

Verse 10 — Surah Al-Infitar 82:10

మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు

Verse 11 — Surah Al-Infitar 82:11

వారు, గౌరవనీయులైన లేఖకులు

Verse 12 — Surah Al-Infitar 82:12

మీరు చేసేదంతా తెలుసుకునేవారు

Verse 13 — Surah Al-Infitar 82:13

నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు

Verse 14 — Surah Al-Infitar 82:14

మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు

Verse 15 — Surah Al-Infitar 82:15

తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు

Verse 16 — Surah Al-Infitar 82:16

మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు

Verse 17 — Surah Al-Infitar 82:17

మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది

Verse 18 — Surah Al-Infitar 82:18

అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది

Verse 19 — Surah Al-Infitar 82:19

ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది