Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 85 - Al-Buruj
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah Al-Buruj 85:1
విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా
Verse 2 — Surah Al-Buruj 85:2
వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా
Verse 3 — Surah Al-Buruj 85:3
చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా
Verse 4 — Surah Al-Buruj 85:4
అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు
Verse 5 — Surah Al-Buruj 85:5
ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు
Verse 6 — Surah Al-Buruj 85:6
వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు
Verse 7 — Surah Al-Buruj 85:7
మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు
Verse 8 — Surah Al-Buruj 85:8
మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే
Verse 9 — Surah Al-Buruj 85:9
ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి
Verse 10 — Surah Al-Buruj 85:10
ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది
Verse 11 — Surah Al-Buruj 85:11
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అదే గొప్ప విజయం
Verse 12 — Surah Al-Buruj 85:12
నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది
Verse 13 — Surah Al-Buruj 85:13
నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు
Verse 14 — Surah Al-Buruj 85:14
మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు
Verse 15 — Surah Al-Buruj 85:15
సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు, మహత్త్వపూర్ణుడు
Verse 16 — Surah Al-Buruj 85:16
తాను తలచింది చేయగలవాడు
Verse 17 — Surah Al-Buruj 85:17
ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా
Verse 18 — Surah Al-Buruj 85:18
ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల)
Verse 19 — Surah Al-Buruj 85:19
అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు
Verse 20 — Surah Al-Buruj 85:20
మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు
Verse 21 — Surah Al-Buruj 85:21
వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన ఖుర్ఆన్
Verse 22 — Surah Al-Buruj 85:22
సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్) లో (వ్రాయబడి) ఉన్నది