Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 86 - At-Tariq
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah At-Tariq 86:1
ఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా
Verse 2 — Surah At-Tariq 86:2
రాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది
Verse 3 — Surah At-Tariq 86:3
అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం
Verse 4 — Surah At-Tariq 86:4
కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు
Verse 5 — Surah At-Tariq 86:5
కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి
Verse 6 — Surah At-Tariq 86:6
అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు
Verse 7 — Surah At-Tariq 86:7
అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది
Verse 8 — Surah At-Tariq 86:8
నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు
Verse 9 — Surah At-Tariq 86:9
ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో
Verse 10 — Surah At-Tariq 86:10
అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు
Verse 11 — Surah At-Tariq 86:11
వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా
Verse 12 — Surah At-Tariq 86:12
(చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా
Verse 13 — Surah At-Tariq 86:13
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి)
Verse 14 — Surah At-Tariq 86:14
మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు
Verse 15 — Surah At-Tariq 86:15
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు
Verse 16 — Surah At-Tariq 86:16
మరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను
Verse 17 — Surah At-Tariq 86:17
కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధి నివ్వు! వారి పట్ల మృదువుగా వ్యవహరించు