Back to Languages

Telugu - Chapter 87 - Al-Ala

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Al-Ala 87:1

అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు

Verse 2 — Surah Al-Ala 87:2

ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు

Verse 3 — Surah Al-Ala 87:3

మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు

Verse 4 — Surah Al-Ala 87:4

మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు

Verse 5 — Surah Al-Ala 87:5

మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు

Verse 6 — Surah Al-Ala 87:6

మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు

Verse 7 — Surah Al-Ala 87:7

అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు

Verse 8 — Surah Al-Ala 87:8

మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము

Verse 9 — Surah Al-Ala 87:9

కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు

Verse 10 — Surah Al-Ala 87:10

(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు

Verse 11 — Surah Al-Ala 87:11

మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు

Verse 12 — Surah Al-Ala 87:12

అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు

Verse 13 — Surah Al-Ala 87:13

అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు

Verse 14 — Surah Al-Ala 87:14

సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు

Verse 15 — Surah Al-Ala 87:15

మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు

Verse 16 — Surah Al-Ala 87:16

అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు

Verse 17 — Surah Al-Ala 87:17

కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది

Verse 18 — Surah Al-Ala 87:18

నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది

Verse 19 — Surah Al-Ala 87:19

ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో