Back to Languages

Telugu - Chapter 88 - Al-Ghashiyah

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Al-Ghashiyah 88:1

హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరుత్థాన దినపు) సమాచారం నీకు అందిందా

Verse 2 — Surah Al-Ghashiyah 88:2

కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి

Verse 3 — Surah Al-Ghashiyah 88:3

(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి

Verse 4 — Surah Al-Ghashiyah 88:4

వారు దహించే అగ్నిలో పడి కాలుతారు

Verse 5 — Surah Al-Ghashiyah 88:5

వారికి సలసల కాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది

Verse 6 — Surah Al-Ghashiyah 88:6

వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు

Verse 7 — Surah Al-Ghashiyah 88:7

అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు

Verse 8 — Surah Al-Ghashiyah 88:8

ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి

Verse 9 — Surah Al-Ghashiyah 88:9

తాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు

Verse 10 — Surah Al-Ghashiyah 88:10

అత్యున్నతమైన స్వర్గవనంలో

Verse 11 — Surah Al-Ghashiyah 88:11

అందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు

Verse 12 — Surah Al-Ghashiyah 88:12

అందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి

Verse 13 — Surah Al-Ghashiyah 88:13

అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి

Verse 14 — Surah Al-Ghashiyah 88:14

మరియు పేర్చబడిన (మధు) పాత్రలు

Verse 15 — Surah Al-Ghashiyah 88:15

మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు

Verse 16 — Surah Al-Ghashiyah 88:16

మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు

Verse 17 — Surah Al-Ghashiyah 88:17

ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో

Verse 18 — Surah Al-Ghashiyah 88:18

మరియు ఆకాశం వైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో

Verse 19 — Surah Al-Ghashiyah 88:19

మరియు కొండల వైపుకు చూడరా?అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో

Verse 20 — Surah Al-Ghashiyah 88:20

మరియు భూమి వైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో

Verse 21 — Surah Al-Ghashiyah 88:21

కావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే

Verse 22 — Surah Al-Ghashiyah 88:22

నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు

Verse 23 — Surah Al-Ghashiyah 88:23

ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో

Verse 24 — Surah Al-Ghashiyah 88:24

అప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు

Verse 25 — Surah Al-Ghashiyah 88:25

నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది

Verse 26 — Surah Al-Ghashiyah 88:26

ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే