Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 89 - Al-Fajr
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah Al-Fajr 89:1
ప్రాంతః కాలం సాక్షిగా
Verse 2 — Surah Al-Fajr 89:2
పది రాత్రుల సాక్షిగా
Verse 3 — Surah Al-Fajr 89:3
సరి బేసీల సాక్షిగా
Verse 4 — Surah Al-Fajr 89:4
గడచిపోయే రాత్రి సాక్షిగా
Verse 5 — Surah Al-Fajr 89:5
వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి
Verse 6 — Surah Al-Fajr 89:6
నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా
Verse 7 — Surah Al-Fajr 89:7
ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల
Verse 8 — Surah Al-Fajr 89:8
వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు
Verse 9 — Surah Al-Fajr 89:9
మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల
Verse 10 — Surah Al-Fajr 89:10
మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల
Verse 11 — Surah Al-Fajr 89:11
వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు
Verse 12 — Surah Al-Fajr 89:12
మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు
Verse 13 — Surah Al-Fajr 89:13
కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు
Verse 14 — Surah Al-Fajr 89:14
వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)
Verse 15 — Surah Al-Fajr 89:15
అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు
Verse 16 — Surah Al-Fajr 89:16
కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు
Verse 17 — Surah Al-Fajr 89:17
అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు
Verse 18 — Surah Al-Fajr 89:18
మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు
Verse 19 — Surah Al-Fajr 89:19
మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు
Verse 20 — Surah Al-Fajr 89:20
మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు
Verse 21 — Surah Al-Fajr 89:21
అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు
Verse 22 — Surah Al-Fajr 89:22
మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు
Verse 23 — Surah Al-Fajr 89:23
ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ
Verse 24 — Surah Al-Fajr 89:24
అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు
Verse 25 — Surah Al-Fajr 89:25
అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు
Verse 26 — Surah Al-Fajr 89:26
మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు
Verse 27 — Surah Al-Fajr 89:27
(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా
Verse 28 — Surah Al-Fajr 89:28
నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై
Verse 29 — Surah Al-Fajr 89:29
నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో
Verse 30 — Surah Al-Fajr 89:30
మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు