Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 90 - Al-Balad
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah Al-Balad 90:1
కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)
Verse 2 — Surah Al-Balad 90:2
మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది
Verse 3 — Surah Al-Balad 90:3
మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా
Verse 4 — Surah Al-Balad 90:4
వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము
Verse 5 — Surah Al-Balad 90:5
ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా
Verse 6 — Surah Al-Balad 90:6
అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు
Verse 7 — Surah Al-Balad 90:7
ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా
Verse 8 — Surah Al-Balad 90:8
ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా
Verse 9 — Surah Al-Balad 90:9
మరియు నాలుకను మరియు రెండు పెదవులను
Verse 10 — Surah Al-Balad 90:10
మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము
Verse 11 — Surah Al-Balad 90:11
కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు
Verse 12 — Surah Al-Balad 90:12
మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా
Verse 13 — Surah Al-Balad 90:13
అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం
Verse 14 — Surah Al-Balad 90:14
లేదా! (స్వయంగా) ఆకలి గొని ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం
Verse 15 — Surah Al-Balad 90:15
సమీప అనాథునికి గానీ
Verse 16 — Surah Al-Balad 90:16
లేక, దిక్కులేని నిరుపేదకు గానీ
Verse 17 — Surah Al-Balad 90:17
మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం
Verse 18 — Surah Al-Balad 90:18
ఇలాంటి వారే కుడిపక్షం వారు
Verse 19 — Surah Al-Balad 90:19
ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు
Verse 20 — Surah Al-Balad 90:20
వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది