Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 91 - Ash-Shams
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah Ash-Shams 91:1
సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా
Verse 2 — Surah Ash-Shams 91:2
దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా
Verse 3 — Surah Ash-Shams 91:3
ప్రకాశించే పగటి సాక్షిగా
Verse 4 — Surah Ash-Shams 91:4
దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా
Verse 5 — Surah Ash-Shams 91:5
ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా
Verse 6 — Surah Ash-Shams 91:6
భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా
Verse 7 — Surah Ash-Shams 91:7
మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా
Verse 8 — Surah Ash-Shams 91:8
ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు
Verse 9 — Surah Ash-Shams 91:9
వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు
Verse 10 — Surah Ash-Shams 91:10
మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు
Verse 11 — Surah Ash-Shams 91:11
సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు
Verse 12 — Surah Ash-Shams 91:12
అల్లాహ్ సందేశహరుడు (సాలిహ్) వారితో: "ఈ ఆడ ఒంటె అల్లాహ్ కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు
Verse 13 — Surah Ash-Shams 91:13
అయినా వారు అతని (సాలిహ్) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనక మోకాలి నరాన్ని కోసి, కుంటిదాన్ని చేసి చంపారు
Verse 14 — Surah Ash-Shams 91:14
కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనం చేశాడు
Verse 15 — Surah Ash-Shams 91:15
మరియు ఆయన (అల్లాహ్) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు