Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 95 - At-Tin
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah At-Tin 95:1
అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా
Verse 2 — Surah At-Tin 95:2
సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా
Verse 3 — Surah At-Tin 95:3
ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా
Verse 4 — Surah At-Tin 95:4
వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము
Verse 5 — Surah At-Tin 95:5
తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము
Verse 6 — Surah At-Tin 95:6
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది
Verse 7 — Surah At-Tin 95:7
అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు
Verse 8 — Surah At-Tin 95:8
ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా