Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 96 - Al-Alaq
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah Al-Alaq 96:1
చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు
Verse 2 — Surah Al-Alaq 96:2
ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు
Verse 3 — Surah Al-Alaq 96:3
చదువు! మరియు నీ ప్రభువు పరమదాత
Verse 4 — Surah Al-Alaq 96:4
ఆయన కలం ద్వారా నేర్పాడు
Verse 5 — Surah Al-Alaq 96:5
మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు
Verse 6 — Surah Al-Alaq 96:6
అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు
Verse 7 — Surah Al-Alaq 96:7
ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు
Verse 8 — Surah Al-Alaq 96:8
నిశ్చయంగా నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది
Verse 9 — Surah Al-Alaq 96:9
నీవు నిరోధించే వ్యక్తిని చూశావా
Verse 10 — Surah Al-Alaq 96:10
నమాజ్ చేసే (అల్లాహ్) దాసుణ్ణి
Verse 11 — Surah Al-Alaq 96:11
ఒకవేళ అతను (ముహమ్మద్!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి
Verse 12 — Surah Al-Alaq 96:12
ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే
Verse 13 — Surah Al-Alaq 96:13
ఒకవేళ (ఆ నిరోధించే) వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే
Verse 14 — Surah Al-Alaq 96:14
వాస్తవానికి, అల్లాహ్ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా
Verse 15 — Surah Al-Alaq 96:15
అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము
Verse 16 — Surah Al-Alaq 96:16
అది అబద్ధాలలో, అపరాధాలలో మునిగివున్న నుదురు
Verse 17 — Surah Al-Alaq 96:17
అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను
Verse 18 — Surah Al-Alaq 96:18
మేము కూడా నరక దూతలను పిలుస్తాము
Verse 19 — Surah Al-Alaq 96:19
అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు