Back to Languages

Telugu - Chapter 99 - Az-Zalzalah

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Az-Zalzalah 99:1

భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు

Verse 2 — Surah Az-Zalzalah 99:2

మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు

Verse 3 — Surah Az-Zalzalah 99:3

మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు

Verse 4 — Surah Az-Zalzalah 99:4

ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది

Verse 5 — Surah Az-Zalzalah 99:5

ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు

Verse 6 — Surah Az-Zalzalah 99:6

ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు

Verse 7 — Surah Az-Zalzalah 99:7

అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు

Verse 8 — Surah Az-Zalzalah 99:8

మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు