Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 110 - An-Nasr
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah An-Nasr 110:1
(ఓ ముహమ్మద్!) ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)
Verse 2 — Surah An-Nasr 110:2
మరియు నీవు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో
Verse 3 — Surah An-Nasr 110:3
అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు