Back to Languages

Telugu - Chapter 111 - Al-Masad

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Al-Masad 111:1

అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక

Verse 2 — Surah Al-Masad 111:2

అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు

Verse 3 — Surah Al-Masad 111:3

అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు

Verse 4 — Surah Al-Masad 111:4

మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ

Verse 5 — Surah Al-Masad 111:5

ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది