Back to Languages

Telugu - Chapter 44 - Ad-Dukhan

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Ad-Dukhan 44:1

హా - మీమ్

Verse 2 — Surah Ad-Dukhan 44:2

స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా

Verse 3 — Surah Ad-Dukhan 44:3

నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము. నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము

Verse 4 — Surah Ad-Dukhan 44:4

దానిలో (ఆ రాత్రిలో), ప్రతి విషయం వివేకంతో విశదీకరించ బడుతుంది

Verse 5 — Surah Ad-Dukhan 44:5

మా ఆజ్ఞానుసారంగా, నిశ్చయంగా, మేము (సందేశహరులను) పంపుతూ వచ్చాము

Verse 6 — Surah Ad-Dukhan 44:6

నీ ప్రభువు తరఫు నుండి కారుణ్యంగా! నిశ్చయంగా, ఆయనే అంతా వినేవాడు, సర్వజ్ఞుడు

Verse 7 — Surah Ad-Dukhan 44:7

భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు. మీకు వాస్తవంగా నమ్మకమే ఉంటే

Verse 8 — Surah Ad-Dukhan 44:8

ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన మీ ప్రభువు మరియు పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు

Verse 9 — Surah Ad-Dukhan 44:9

అసలు! వారు సందేహంలో పడి ఆటల్లో మునిగి ఉన్నారు (పరిహసిస్తున్నారు)

Verse 10 — Surah Ad-Dukhan 44:10

కావున నీవు ఆకాశం నుండి స్పష్టమైన పొగ వచ్చే దినం కొరకు నిరీక్షించు

Verse 11 — Surah Ad-Dukhan 44:11

అది మానవులందరినీ క్రమ్ముకుంటుంది. అదొక బాధాకరమైన శిక్ష

Verse 12 — Surah Ad-Dukhan 44:12

(అప్పుడు వారు ఇలా వేడుకుంటారు): "ఓ మా ప్రభూ! ఈ శిక్షను మా నుండి తొలగించు. నిశ్చయంగా, మేము విశ్వాసుల మవుతాము

Verse 13 — Surah Ad-Dukhan 44:13

ఇక (అంతిమ ఘడియలో) హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికి రాగలదు? వాస్తవానికి వారి వద్దకు (సత్యాన్ని) స్పష్టంగా తెలియజేసే ప్రవక్త వచ్చి ఉన్నాడు

Verse 14 — Surah Ad-Dukhan 44:14

అప్పుడు వారు అతని నుండి మరలి పోయారు మరియు ఇలా అన్నారు: "ఇతను ఇతరుల నుండి నేర్చుకున్నాడు, ఇతనొక పిచ్చివాడు

Verse 15 — Surah Ad-Dukhan 44:15

వాస్తవానికి మేము కొంతకాలం వరకు ఈ శిక్షను తొలగిస్తే నిశ్చయంగా, మీరు చేస్తూ వచ్చిందే మళ్ళీ చేస్తారు

Verse 16 — Surah Ad-Dukhan 44:16

మేము శిక్షించటం కోసం గట్టిగా పట్టుకున్న రోజు, మేము నిశ్చయంగా, ప్రతీకారం చేస్తాము

Verse 17 — Surah Ad-Dukhan 44:17

మరియు వాస్తవంగా, వారికి పూర్వం మేము ఫిర్ఔన్ జాతి వారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చి ఉన్నాడు

Verse 18 — Surah Ad-Dukhan 44:18

(అతను ఇలా అన్నాడు): "అల్లాహ్ దాసులను నాకు అప్పగించు. నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణయిన సందేశహరుణ్ణి

Verse 19 — Surah Ad-Dukhan 44:19

మరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకొని వచ్చాను

Verse 20 — Surah Ad-Dukhan 44:20

మరియు నిశ్చయంగా, నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన) అల్లాహ్ యొక్క శరణు పొందాను, - మీరు నన్ను రాళ్లు రువ్వి చంపకుండా ఉండటానికి

Verse 21 — Surah Ad-Dukhan 44:21

ఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి

Verse 22 — Surah Ad-Dukhan 44:22

చివరకు అతను తన ప్రభువున ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా, ఈ జనులు చాలా అపరాధులు

Verse 23 — Surah Ad-Dukhan 44:23

(అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు): "నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలు దేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు

Verse 24 — Surah Ad-Dukhan 44:24

మరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళిపో. నిశ్చయంగా, ఆ సైనికులు అందులో మునిగిపోతారు

Verse 25 — Surah Ad-Dukhan 44:25

వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచి పోయారు

Verse 26 — Surah Ad-Dukhan 44:26

మరియు ఎన్నో పంటపొలాలను మరియు గొప్ప భవనాలను

Verse 27 — Surah Ad-Dukhan 44:27

మరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖసంతోషాలను కూడా

Verse 28 — Surah Ad-Dukhan 44:28

ఈ విధంగా, (వారి ముగింపు జరిగింది). మరియు మేము వాటికి ఇతర జాతి వారిని వారసులుగా చేశాము

Verse 29 — Surah Ad-Dukhan 44:29

కాని, వారి కొరకు ఆకాశం గానీ, భూమి గానీ విలపించలేదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు

Verse 30 — Surah Ad-Dukhan 44:30

మరియు వాస్తవంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని అవమానకరమైన శిక్ష నుండి విముక్తి కలిగించాము

Verse 31 — Surah Ad-Dukhan 44:31

ఫిర్ఔన్ నుండి నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించేవారి, అగ్రగణ్యుడు

Verse 32 — Surah Ad-Dukhan 44:32

మరియు వాస్తవానికి మాకు తెలిసి ఉండి కూడా మేము వారిని లోకంలో (ఆ కాలపు) సర్వజనులపై ఎన్నుకున్నాము

Verse 33 — Surah Ad-Dukhan 44:33

మరియు మేము వారికి అద్భుత సూచనలను (ఆయాత్ లను) ఒసంగి ఉంటిమి. అందులో వారికి స్పష్టమైన పరీక్ష ఉండింది

Verse 34 — Surah Ad-Dukhan 44:34

నిశ్చయంగా, వీరు (ఖురైషులు) ఇలా అంటున్నారు

Verse 35 — Surah Ad-Dukhan 44:35

వాస్తవానికి, మాకు ఈ మొదటి మరణం మాత్రమే ఉంది, ఆ తరువాత మేము తిరిగి బ్రతికించబడము

Verse 36 — Surah Ad-Dukhan 44:36

మీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురండి

Verse 37 — Surah Ad-Dukhan 44:37

వారు మేలైన వారా? లేక తుబ్బఅ జాతివారు మరియు వారి కంటే పూర్వం వారా? మేము వారందరినీ నాశనం చేశాము. నిశ్చయంగా, వారందరూ అపరాధులే

Verse 38 — Surah Ad-Dukhan 44:38

మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆట (కాలక్షేపం) కొరకు సృష్టించలేదు

Verse 39 — Surah Ad-Dukhan 44:39

మేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టించాము, కాని చాలా మందికి ఇది తెలియదు

Verse 40 — Surah Ad-Dukhan 44:40

నిశ్చయంగా, తీర్పుదినం వారందరి కొరకు ఒక నిర్ణీత దినం

Verse 41 — Surah Ad-Dukhan 44:41

ఆ దినమున ఏ స్నేహితుడు కూడా మరొక స్నేహితునికి ఏ మాత్రం ఉపయోగపడడు. మరియు వారికి ఎలాంటి సహాయమూ లభించదు

Verse 42 — Surah Ad-Dukhan 44:42

అల్లాహ్ కరుణించిన వానికి తప్ప! నిశ్చయంగా, ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత

Verse 43 — Surah Ad-Dukhan 44:43

నిశ్చయంగా, జఖ్ఖూమ్ వృక్షఫలం

Verse 44 — Surah Ad-Dukhan 44:44

పాపులకు ఆహారంగా ఇవ్వబడుతుంది

Verse 45 — Surah Ad-Dukhan 44:45

మరిగే నూనే (సీసం) వలే, అది వారి కడుపులో మరుగుతుంది

Verse 46 — Surah Ad-Dukhan 44:46

సలసల కాగే నీటిలాగా

Verse 47 — Surah Ad-Dukhan 44:47

(ఇలా అనబడుతుంది): "ఇతనిని పట్టుకొని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్వండి

Verse 48 — Surah Ad-Dukhan 44:48

ఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి

Verse 49 — Surah Ad-Dukhan 44:49

దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా

Verse 50 — Surah Ad-Dukhan 44:50

నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం

Verse 51 — Surah Ad-Dukhan 44:51

నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు

Verse 52 — Surah Ad-Dukhan 44:52

ఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య

Verse 53 — Surah Ad-Dukhan 44:53

వారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు

Verse 54 — Surah Ad-Dukhan 44:54

ఇలా ఉంటుంది వారి స్థితి! మరియు మేము వారిని అందమైన, ప్రకాశవంతమైన కళ్ళు గల వారితో (హూర్ లతో) వివాహం చేయిస్తాము

Verse 55 — Surah Ad-Dukhan 44:55

వారక్కడ శాంతియుతంగా ఉంటూ అనేక రకాలైన ఫలాలను అడుగుతుంటారు

Verse 56 — Surah Ad-Dukhan 44:56

వారక్కడ మరణాన్ని ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన వారిని భగభగమండే అగ్నిశిక్ష నుండి కాపాడాడు

Verse 57 — Surah Ad-Dukhan 44:57

నీ ప్రభువు అనుగ్రహం వల్ల. ఇదే ఆ గొప్ప సాఫల్యం

Verse 58 — Surah Ad-Dukhan 44:58

అందుకే నిశ్చయంగా, మేము (ఈ ఖుర్ఆన్ ను) నీ భాషలో సులభం చేశాము. ఇలాగైనా వారు అర్థం చేసుకుంటారని (హితబోధ గ్రహిస్తారని)

Verse 59 — Surah Ad-Dukhan 44:59

కావున, నీవు నిరీక్షించు! నిశ్చయంగా వారు కూడా నిరీక్షిస్తున్నారు