Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Telugu - Chapter 26 - Ash-Shuara
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah Ash-Shuara 26:1
తా - సీన్ - మీమ్
Verse 2 — Surah Ash-Shuara 26:2
ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయతులు)
Verse 3 — Surah Ash-Shuara 26:3
(ఓ ముహమ్మద్) వారు విశ్వసించలేదనే బాధతో బహుశా నీవు నీ ప్రాణాలే కోల్పోతావేమో
Verse 4 — Surah Ash-Shuara 26:4
మేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని (ఆయత్ ను) అవతరింపజేసి, దానికి వారి మెడలను నమ్రతతో వంగి పోయేలా చేసేవారము
Verse 5 — Surah Ash-Shuara 26:5
మరియు వారి వద్దకు అనంత కరుణామయుడని వద్ద నుండి క్రొత్త సందేశం వచ్చినప్పుడల్లా, వారు దాని నుండి విముఖులు కాకుండా ఉండలేదు
Verse 6 — Surah Ash-Shuara 26:6
వాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో వారికి తెలిసిపోతుంది
Verse 7 — Surah Ash-Shuara 26:7
ఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని) పుట్టించామో
Verse 8 — Surah Ash-Shuara 26:8
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు
Verse 9 — Surah Ash-Shuara 26:9
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత
Verse 10 — Surah Ash-Shuara 26:10
మరియు నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించిన విషయాన్ని వారికి జ్ఞాపకం చేయించు: "దుర్మార్గులైన జాతి ప్రజల వద్దకు వెళ్ళు
Verse 11 — Surah Ash-Shuara 26:11
ఫిర్ఔన్ జాతివారి వద్దకు. ఏమీ? వారికి దైవభీతి లేదా
Verse 12 — Surah Ash-Shuara 26:12
(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను
Verse 13 — Surah Ash-Shuara 26:13
నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది, కావున నీవు హారూన్ వద్దకు కూడా (వహీ) పంపు
Verse 14 — Surah Ash-Shuara 26:14
మరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉన్నది, కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను
Verse 15 — Surah Ash-Shuara 26:15
(అల్లాహ్) సెలవిచ్చాడు: "అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో పాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము
Verse 16 — Surah Ash-Shuara 26:16
కావున మీరిద్దరూ ఫిరఔన్ వద్దకు వెళ్ళి అనండి: "నిశ్చయంగా, మేము సర్వలోకాల పోషకుని సందేశహరులము
Verse 17 — Surah Ash-Shuara 26:17
కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు
Verse 18 — Surah Ash-Shuara 26:18
(ఫిర్ఔన్) అన్నాడు: "ఏమీ? మేము నిన్ను బాల్యంలో మాతో పాటు పోషించలేదా? మరియు నీవు నీ వయస్సులోని అనేక సంవత్సరాలు మాతో పాటు గడిపావు కదా
Verse 19 — Surah Ash-Shuara 26:19
అయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతఘ్నులలోని వాడవు
Verse 20 — Surah Ash-Shuara 26:20
(మూసా) అన్నాడు: "నేను పొరపాటుగా ఆ పని చేశాను
Verse 21 — Surah Ash-Shuara 26:21
ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు
Verse 22 — Surah Ash-Shuara 26:22
ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా
Verse 23 — Surah Ash-Shuara 26:23
(ఫిర్ఆన్) అడిగాడు: "అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి
Verse 24 — Surah Ash-Shuara 26:24
(మూసా) జవాబిచ్చాడు: "మీరు నమ్మేవారే అయితే! ఆయనే ఆకాశాలకూ మరియు భూమికీ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు
Verse 25 — Surah Ash-Shuara 26:25
(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న వారితో: "ఏమీ? మీరు వింటున్నారా?" అని ప్రశ్నించాడు
Verse 26 — Surah Ash-Shuara 26:26
(మూసా) అన్నాడు: "ఆయన (అల్లాహ్) మీ ప్రభువు మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కూడానూ
Verse 27 — Surah Ash-Shuara 26:27
(ఫిర్ఔన్) అన్నాడు: "మీ వద్దకు పంపబడిన మీ ఈ సందేశహరుడు నిశ్చయంగా పిచ్చివాడే
Verse 28 — Surah Ash-Shuara 26:28
(మూసా) అన్నాడు: "మీరు అర్థం చేసుకోగలిగితే! ఆయనే తూర్పూ పడమరలకూ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు
Verse 29 — Surah Ash-Shuara 26:29
(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను
Verse 30 — Surah Ash-Shuara 26:30
(మూసా) అన్నాడు: "ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకువచ్చిన తరువాత కూడానా
Verse 31 — Surah Ash-Shuara 26:31
(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు సత్యవంతుడవే అయితే దానిని (ఆ అద్భుత సూచనను) చూపు
Verse 32 — Surah Ash-Shuara 26:32
అప్పుడు (మూసా) తన చేతి కర్రను పడవేయగానే, అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది
Verse 33 — Surah Ash-Shuara 26:33
తరువాత అతను (మూసా) తన చేతిని (చంక నుండి) వెలుపలికి తీయగానే, అది చూసేవారి యెదుట తెల్లగా ప్రకాశించసాగింది
Verse 34 — Surah Ash-Shuara 26:34
(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న నాయకులతో అన్నాడు: "నిశ్చయంగా, ఇతనొక నేర్పు గల మాంత్రికుడు
Verse 35 — Surah Ash-Shuara 26:35
ఇతను తన మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి తరుమ గోరుతున్నాడు, అయితే మీ సలహా ఏమిటి
Verse 36 — Surah Ash-Shuara 26:36
వారన్నారు: "అతనిని మరియు అతని సోదరుణ్ణి ఆపి ఉంచు మరియు (మంత్రగాళ్ళను) సమావేశ పరచటానికి అన్ని నగరాలకు వార్తాహరులను పంపు
Verse 37 — Surah Ash-Shuara 26:37
వారు నీ వద్దకు నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి తెస్తారు
Verse 38 — Surah Ash-Shuara 26:38
ఈ విధంగా ఒక నియమిత రోజున ఒక నియమిత ప్రదేశంలో మాంత్రికులంతా సమావేశ పరచబడ్డారు
Verse 39 — Surah Ash-Shuara 26:39
మరియు ప్రజలతో ఇలా ప్రశ్నించడం జరిగింది: "ఏమీ? మీరంతా సమావేశమయ్యారా
Verse 40 — Surah Ash-Shuara 26:40
ఒకవేళ మాంత్రికులు గెలుపొందితే మనమంతా వారిని అనుసరించాలి కదా
Verse 41 — Surah Ash-Shuara 26:41
మాంత్రికులు వచ్చిన తరువాత ఫిర్ఔన్ తో అన్నారు: "మేము గెలుపొందితే నిశ్చయంగా మాకు బహుమాన ముంది కదా
Verse 42 — Surah Ash-Shuara 26:42
(ఫిర్ఔన్) అన్నాడు: "అవును! నిశ్చయంగా, అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరుతారు
Verse 43 — Surah Ash-Shuara 26:43
మూసా వారితో అన్నాడు: "మీరు విసర దలుచుకున్న దానిని విసరండి
Verse 44 — Surah Ash-Shuara 26:44
అప్పుడు వారు తమ త్రాళ్ళను మరియు తమ కర్రలను విసిరి ఇలా అన్నారు: "ఫిర్ఔన్ శక్తి సాక్షిగా! నిశ్చయంగా మేమే విజయం పొందుతాము
Verse 45 — Surah Ash-Shuara 26:45
ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి వేసింది
Verse 46 — Surah Ash-Shuara 26:46
అప్పుడు ఆ మాంత్రికులు సజ్దాలో పడ్డారు
Verse 47 — Surah Ash-Shuara 26:47
వారన్నారు: "మేము సర్వలోకాల ప్రభువును విశ్వసిస్తున్నాము
Verse 48 — Surah Ash-Shuara 26:48
మూసా మరియు హారూన్ ల ప్రభువును
Verse 49 — Surah Ash-Shuara 26:49
(ఫిర్ఔన్) అన్నాడు: "నేను మీకు అనుమతి ఇవ్వక ముందే మీరు ఇతనిని విశ్వసించారా? నిశ్చయంగా, ఇతడే మీ గురువు, మీకు జాలవిద్యను నేర్పినవాడు. సరే! ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక (ప్రతిపక్ష) దిశల చేతులను మరియు కాళ్ళను నరికిస్తాను మరియు మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను
Verse 50 — Surah Ash-Shuara 26:50
(మాంత్రికులు) అన్నారు: "బాధ లేదు! నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది
Verse 51 — Surah Ash-Shuara 26:51
నిశ్చయంగా, మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వాస్తవానికి అందరి కంటే ముందుగా విశ్వసించిన వారం మేమే
Verse 52 — Surah Ash-Shuara 26:52
మరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "నీవు నా దాసులను రాత్రివేళ తీసుకొని వెళ్ళిపో నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు
Verse 53 — Surah Ash-Shuara 26:53
తరువాత ఫిర్ఔన్ అన్ని పట్టణాలకు వార్తాహరులను పంపాడు
Verse 54 — Surah Ash-Shuara 26:54
(ఇలా ప్రకటన చేయించాడు): "వాస్తవానికి వీరు (ఈ ఇస్రాయీల్ సంతతి వారు) ఒక చిన్న తెగవారు మాత్రమే
Verse 55 — Surah Ash-Shuara 26:55
మరియు నిశ్చయంగా, వారు మాకు చాలా కోపం తెప్పించారు
Verse 56 — Surah Ash-Shuara 26:56
మరియు నిశ్చయంగా, మనం ఐకమత్యంతో ఉండి జాగరూకత చూపేవారము
Verse 57 — Surah Ash-Shuara 26:57
కావున మేము వారిని, తోటల నుండి మరియు చెలమల నుండి వెళ్ళగొట్టాము
Verse 58 — Surah Ash-Shuara 26:58
మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా
Verse 59 — Surah Ash-Shuara 26:59
ఈ విధంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని, వాటికి వారసులుగా చేశాము
Verse 60 — Surah Ash-Shuara 26:60
అప్పుడు (ఫిర్ఔన్ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీల్ సంతతి) వారిని వెంబడించారు
Verse 61 — Surah Ash-Shuara 26:61
ఆ ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు, మూసా అనుచరులు అన్నారు: "నిశ్చయంగా మేము చిక్కి పోయాము
Verse 62 — Surah Ash-Shuara 26:62
(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)
Verse 63 — Surah Ash-Shuara 26:63
అప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది
Verse 64 — Surah Ash-Shuara 26:64
మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము
Verse 65 — Surah Ash-Shuara 26:65
మరియు మూసాను మరియు అతనితో పాటు ఉన్నవారిని అందరినీ రక్షించాము
Verse 66 — Surah Ash-Shuara 26:66
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము
Verse 67 — Surah Ash-Shuara 26:67
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు
Verse 68 — Surah Ash-Shuara 26:68
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిసంపన్నుడు, అపార కరుణా ప్రదాత
Verse 69 — Surah Ash-Shuara 26:69
ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు
Verse 70 — Surah Ash-Shuara 26:70
అతను తన తండ్రితో మరియు తన జాతి వారితో: "మీరెవరిని ఆరాధిస్తున్నారు?" అని అడిగినపుడు
Verse 71 — Surah Ash-Shuara 26:71
వారన్నారు: "మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడు భక్తులమై ఉంటాము
Verse 72 — Surah Ash-Shuara 26:72
(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా
Verse 73 — Surah Ash-Shuara 26:73
లేదా, మీకేమైనా మేలు చేయగలవా? లేదా హాని చేయగలవా
Verse 74 — Surah Ash-Shuara 26:74
వారన్నారు: "అలా కాదు! మేము మా తండ్రితాతలను ఇలా చేస్తూ ఉండగా చూశాము
Verse 75 — Surah Ash-Shuara 26:75
అతను అన్నాడు: "ఏమీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరెవరిని ఆరాధిస్తున్నారో
Verse 76 — Surah Ash-Shuara 26:76
మీరు గానీ మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ (ఆలోచించారా)
Verse 77 — Surah Ash-Shuara 26:77
ఎందుకంటే! నిశ్చయంగా, ఇవన్నీ నా శత్రువులే! కేవలం ఆ సర్వలోకాల ప్రభువు తప్ప
Verse 78 — Surah Ash-Shuara 26:78
ఆయనే నన్ను సృష్టించాడు. కాబట్టి ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు
Verse 79 — Surah Ash-Shuara 26:79
ఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు
Verse 80 — Surah Ash-Shuara 26:80
మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థత నిచ్చేవాడు
Verse 81 — Surah Ash-Shuara 26:81
మరియు ఆయనే నన్ను మరణింపజేసేవాడు, తరువాత మళ్ళీ బ్రతికింపజేసేవాడు
Verse 82 — Surah Ash-Shuara 26:82
మరియు ఆయనే తీర్పుదినమున నా తప్పులను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాను
Verse 83 — Surah Ash-Shuara 26:83
మరియు ఓ నా ఫ్రభూ! నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు
Verse 84 — Surah Ash-Shuara 26:84
మరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు
Verse 85 — Surah Ash-Shuara 26:85
మరియు సర్వసుఖాల స్వర్గానికి వారసులయ్యేవారిలో నన్ను చేర్చు
Verse 86 — Surah Ash-Shuara 26:86
మరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే
Verse 87 — Surah Ash-Shuara 26:87
మరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానం పాల చేయకు
Verse 88 — Surah Ash-Shuara 26:88
ఏ రోజునైతే ధనసంపత్తులు గానీ, సంతానం గానీ పనికిరావో
Verse 89 — Surah Ash-Shuara 26:89
కేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప
Verse 90 — Surah Ash-Shuara 26:90
మరియు (ఆ రోజు) స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకు రాబడుతుంది
Verse 91 — Surah Ash-Shuara 26:91
మరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది
Verse 92 — Surah Ash-Shuara 26:92
మరియు వారితో అనబడుతుంది: "మీరు ఆరాధించేవారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడున్నారు
Verse 93 — Surah Ash-Shuara 26:93
అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా
Verse 94 — Surah Ash-Shuara 26:94
అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు
Verse 95 — Surah Ash-Shuara 26:95
మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ
Verse 96 — Surah Ash-Shuara 26:96
వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు
Verse 97 — Surah Ash-Shuara 26:97
అల్లాహ్ సాక్షిగా! మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము
Verse 98 — Surah Ash-Shuara 26:98
ఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో
Verse 99 — Surah Ash-Shuara 26:99
మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే
Verse 100 — Surah Ash-Shuara 26:100
మాకిప్పుడు సిఫారసు చేసేవారు ఎవ్వరూ లేరు
Verse 101 — Surah Ash-Shuara 26:101
మరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు
Verse 102 — Surah Ash-Shuara 26:102
ఒకవేళ మళ్ళీ మరలిపోయే అవకాశం మాకు దొరికి ఉంటే, మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము
Verse 103 — Surah Ash-Shuara 26:103
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు
Verse 104 — Surah Ash-Shuara 26:104
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత
Verse 105 — Surah Ash-Shuara 26:105
నూహ్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది
Verse 106 — Surah Ash-Shuara 26:106
వారి సహోదరుడు నూహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా
Verse 107 — Surah Ash-Shuara 26:107
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను
Verse 108 — Surah Ash-Shuara 26:108
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
Verse 109 — Surah Ash-Shuara 26:109
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది
Verse 110 — Surah Ash-Shuara 26:110
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
Verse 111 — Surah Ash-Shuara 26:111
వారన్నారు: "ఏమీ? మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైన వారే కదా అనుసరిస్తున్నది
Verse 112 — Surah Ash-Shuara 26:112
(నూహ్) అన్నాడు: "వారేమి (పనులు) చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు
Verse 113 — Surah Ash-Shuara 26:113
వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది
Verse 114 — Surah Ash-Shuara 26:114
మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను
Verse 115 — Surah Ash-Shuara 26:115
నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే
Verse 116 — Surah Ash-Shuara 26:116
వారన్నారు: "ఓ నూహ్! నీవు దీనిని మానుకోకపోతే, నీవు తప్పక రాళ్ళు రువ్వి చంపబడతావు
Verse 117 — Surah Ash-Shuara 26:117
(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నా జాతి ప్రజలు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తున్నారు
Verse 118 — Surah Ash-Shuara 26:118
కావున నీవే నాకూ మరియు వారికీ మధ్య తీర్పు చేయి. మరియు నన్నూ మరియు నాతో పాటు ఉన్న విశ్వాసులనూ కాపాడు
Verse 119 — Surah Ash-Shuara 26:119
ఆ పిదప మేము అతనిని మరియు అతనితో పాట నిండునావలో ఎక్కి ఉన్న వారినందరినీ కాపాడాము
Verse 120 — Surah Ash-Shuara 26:120
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము
Verse 121 — Surah Ash-Shuara 26:121
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు
Verse 122 — Surah Ash-Shuara 26:122
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత
Verse 123 — Surah Ash-Shuara 26:123
ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది
Verse 124 — Surah Ash-Shuara 26:124
వారి సహోదరుడు హూద్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా
Verse 125 — Surah Ash-Shuara 26:125
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను
Verse 126 — Surah Ash-Shuara 26:126
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
Verse 127 — Surah Ash-Shuara 26:127
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది
Verse 128 — Surah Ash-Shuara 26:128
ఏమీ? మీరు కేవలం ఆడంబరానికి ప్రతి ఎత్తైన స్థలం మీద ఒక స్మారకాన్ని నిర్మిస్తారా
Verse 129 — Surah Ash-Shuara 26:129
మరియు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారన్నట్లు పెద్దపెద్ద కోటలు కడతారా
Verse 130 — Surah Ash-Shuara 26:130
మరియు మీరు ఎవరినైనా పట్టుకుంటే, అతి క్రూరులై పట్టుకుంటారా
Verse 131 — Surah Ash-Shuara 26:131
ఇకనైన మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
Verse 132 — Surah Ash-Shuara 26:132
మరియు మీకు తెలిసివున్న (మంచి) వస్తువులను, మీకు విస్తారంగా ఇచ్చిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి
Verse 133 — Surah Ash-Shuara 26:133
ఆయన విస్తారంగా మీకు పశువులను మరియు సంతానాన్ని అనుగ్రహించాడు
Verse 134 — Surah Ash-Shuara 26:134
మరియు తోటలను మరియు చెలమలను
Verse 135 — Surah Ash-Shuara 26:135
నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను
Verse 136 — Surah Ash-Shuara 26:136
వారన్నారు: "నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే
Verse 137 — Surah Ash-Shuara 26:137
ఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే
Verse 138 — Surah Ash-Shuara 26:138
మరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు
Verse 139 — Surah Ash-Shuara 26:139
ఈ విధంగా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు
Verse 140 — Surah Ash-Shuara 26:140
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత
Verse 141 — Surah Ash-Shuara 26:141
సమూద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది
Verse 142 — Surah Ash-Shuara 26:142
వారి సహోదరుడు సాలిహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా
Verse 143 — Surah Ash-Shuara 26:143
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను
Verse 144 — Surah Ash-Shuara 26:144
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
Verse 145 — Surah Ash-Shuara 26:145
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది
Verse 146 — Surah Ash-Shuara 26:146
ఏమీ? మీరిప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలోనే సుఖశాంతులలో ఎల్లప్పుడూ వదలి వేయబడతారని అనుకుంటున్నారా
Verse 147 — Surah Ash-Shuara 26:147
తోటలలో మరియు చెలమలలో
Verse 148 — Surah Ash-Shuara 26:148
మరియు ఈ పొలాలలో, మాగిన పండ్లగుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య
Verse 149 — Surah Ash-Shuara 26:149
మరియు మీరు కొండలను తొలిచి ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారనీ
Verse 150 — Surah Ash-Shuara 26:150
అలా కాదు, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
Verse 151 — Surah Ash-Shuara 26:151
మరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి
Verse 152 — Surah Ash-Shuara 26:152
ఎవరైతే భూమిలో కల్లోలం రేకెత్తిస్తున్నారో మరియు ఎన్నడూ సంస్కరణను చేపట్టరో
Verse 153 — Surah Ash-Shuara 26:153
వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు
Verse 154 — Surah Ash-Shuara 26:154
నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! కావున నీవు సత్యవంతుడవే అయితే, ఏదైనా అద్భుత సూచన తీసుకురా
Verse 155 — Surah Ash-Shuara 26:155
(సాలిహ్) అన్నాడు: "ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి
Verse 156 — Surah Ash-Shuara 26:156
దీనికి హాని కలిగించకండి. అలా చేస్తే ఒక మహా దినపు శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది
Verse 157 — Surah Ash-Shuara 26:157
కాని వారు దాని వెనుక కాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు, ఆ తరువాత వారు పశ్చాత్తాప పడతూ ఉండిపోయారు
Verse 158 — Surah Ash-Shuara 26:158
కావున, వారిని శిక్ష పట్టుకుంది. నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు
Verse 159 — Surah Ash-Shuara 26:159
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత
Verse 160 — Surah Ash-Shuara 26:160
లూత్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది
Verse 161 — Surah Ash-Shuara 26:161
వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా
Verse 162 — Surah Ash-Shuara 26:162
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను
Verse 163 — Surah Ash-Shuara 26:163
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
Verse 164 — Surah Ash-Shuara 26:164
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది
Verse 165 — Surah Ash-Shuara 26:165
(ప్రకృతికి విరుద్ధంగా) సర్వప్రాణులలో కెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటీ
Verse 166 — Surah Ash-Shuara 26:166
మీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అజ్వాజ్) గా పుట్టించిన వారిని విడిచి పెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దు మీరి ప్రవర్తించే జాతివారు
Verse 167 — Surah Ash-Shuara 26:167
(దానికి) వారన్నారు: "ఓ లూత్! ఇక నీవు మానుకోక పోతే నీవు దేశం నుండి బహిష్కరించబడిన వారిలో చేరుతావు
Verse 168 — Surah Ash-Shuara 26:168
(లూత్) అన్నాడు: "నిశ్చయంగా మీ ఈ చేష్టను అసహ్యించుకునే వారిలో నేనూ ఉన్నాను
Verse 169 — Surah Ash-Shuara 26:169
(ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ వీరి చేష్ట నుండి కాపాడు
Verse 170 — Surah Ash-Shuara 26:170
కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరినీ కాపాడాము
Verse 171 — Surah Ash-Shuara 26:171
వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప
Verse 172 — Surah Ash-Shuara 26:172
ఆ తరువాత, మిగతా వారిని నిర్మూలించాము
Verse 173 — Surah Ash-Shuara 26:173
వారిపై ఒక వర్షాన్ని కురిపించాము. అది (ముందు) హెచ్చరించబడిన వారిపై (కురిపించబడ్డ) అతి భయంకరమైన వర్షం
Verse 174 — Surah Ash-Shuara 26:174
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు
Verse 175 — Surah Ash-Shuara 26:175
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత
Verse 176 — Surah Ash-Shuara 26:176
వన (అయ్ కహ్) వాసులు సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించారు
Verse 177 — Surah Ash-Shuara 26:177
షుఐబ్ వారితో ఇలా అన్నాడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా
Verse 178 — Surah Ash-Shuara 26:178
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను
Verse 179 — Surah Ash-Shuara 26:179
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
Verse 180 — Surah Ash-Shuara 26:180
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది
Verse 181 — Surah Ash-Shuara 26:181
మీరు (ఇచ్చినపుడు) సరిగ్గా కొలిచి ఇవ్వండి. నష్టపరిచే వారిలో చేరకండి
Verse 182 — Surah Ash-Shuara 26:182
త్రాసుతో సరిసమానంగా తూచండి
Verse 183 — Surah Ash-Shuara 26:183
ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ దౌర్జన్యపరులుగా ప్రవర్తించకండి
Verse 184 — Surah Ash-Shuara 26:184
మిమ్మల్ని మరియు మీకు పూర్వం గతించిన తరాల వారిని సృష్టించిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి
Verse 185 — Surah Ash-Shuara 26:185
వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు
Verse 186 — Surah Ash-Shuara 26:186
నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! నిశ్చయంగా, మేము నిన్ను అసత్యవాదులలో ఒకనిగా పరిగణిస్తున్నాము
Verse 187 — Surah Ash-Shuara 26:187
నీవు సత్యవంతుడవే అయితే ఆకాశం యొక్క ఒక తునకను మాపై పడవేయి
Verse 188 — Surah Ash-Shuara 26:188
(షుఐబ్) అన్నాడు: "మీరు చేసేది నా ప్రభువుకు బాగా తెలుసు
Verse 189 — Surah Ash-Shuara 26:189
కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి పడింది. నిశ్చయంగా, అదొక భయంకరమైన దినపు శిక్ష
Verse 190 — Surah Ash-Shuara 26:190
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు
Verse 191 — Surah Ash-Shuara 26:191
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత
Verse 192 — Surah Ash-Shuara 26:192
మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం)
Verse 193 — Surah Ash-Shuara 26:193
దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు
Verse 194 — Surah Ash-Shuara 26:194
నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని
Verse 195 — Surah Ash-Shuara 26:195
స్పష్టమైన అరబ్బీ భాషలో
Verse 196 — Surah Ash-Shuara 26:196
నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది
Verse 197 — Surah Ash-Shuara 26:197
ఇస్రాయీల్ సంతతి వారిలోని విద్వాంసులు ఈ విషయాన్ని ఒప్పు కోవటం వారికొక సూచనగా సరిపోదా
Verse 198 — Surah Ash-Shuara 26:198
ఒకవేళ మేము దీనిని అరబ్ కాని వానిపై అవతరింపజేసి ఉంటే
Verse 199 — Surah Ash-Shuara 26:199
అతను దానిని వారికి చదివి వినిపించినా, వారు దానిని విశ్వసించేవారు కారు
Verse 200 — Surah Ash-Shuara 26:200
ఈ విధంగా, మేము దీనిని (తిరస్కారాన్ని) అపరాధుల హృదయాల లోనికి దిగిపోయేలా చేశాము
Verse 201 — Surah Ash-Shuara 26:201
కఠినశిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు
Verse 202 — Surah Ash-Shuara 26:202
అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి పడుతుంది
Verse 203 — Surah Ash-Shuara 26:203
అప్పుడు వారంటారు: "ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా
Verse 204 — Surah Ash-Shuara 26:204
ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా
Verse 205 — Surah Ash-Shuara 26:205
చూశావా? మేము కొన్ని సంవత్సరాలు వారికి (ఈ జీవితంలో) సుఖసంతోషాలతో గడిపే వ్యవధినిచ్చినా
Verse 206 — Surah Ash-Shuara 26:206
తరువాత వాగ్దానం చేయబడినది (శిక్ష) వారిపైకి వచ్చినపుడు
Verse 207 — Surah Ash-Shuara 26:207
వారు అనుభవిస్తూ ఉండిన సుఖసంతోషాలు వారికేమీ పనికిరావు
Verse 208 — Surah Ash-Shuara 26:208
మరియు - హెచ్చరిక చేసేవారిని (ప్రవక్తలను) పంపనిదే - మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు
Verse 209 — Surah Ash-Shuara 26:209
హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు
Verse 210 — Surah Ash-Shuara 26:210
మరియు దీనిని (ఈ దివ్యగ్రంథాన్ని) తీసుకొని క్రిందికి దిగిన వారు షైతానులు కారు
Verse 211 — Surah Ash-Shuara 26:211
మరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు
Verse 212 — Surah Ash-Shuara 26:212
వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు
Verse 213 — Surah Ash-Shuara 26:213
కావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు
Verse 214 — Surah Ash-Shuara 26:214
మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు
Verse 215 — Surah Ash-Shuara 26:215
విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు
Verse 216 — Surah Ash-Shuara 26:216
ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే వారితో అను: "మీరు చేసే కార్యాలకు నేను బాధ్యుడను కాను
Verse 217 — Surah Ash-Shuara 26:217
మరియు ఆ సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత మీద నమ్మకం ఉంచుకో
Verse 218 — Surah Ash-Shuara 26:218
ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు
Verse 219 — Surah Ash-Shuara 26:219
మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారితో నీ రాకపోకడలను కూడా
Verse 220 — Surah Ash-Shuara 26:220
నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
Verse 221 — Surah Ash-Shuara 26:221
షైతాన్ లు ఎవరిపై దిగుతారో నేను మీకు తెలుపనా
Verse 222 — Surah Ash-Shuara 26:222
వారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు
Verse 223 — Surah Ash-Shuara 26:223
గాలి వార్తలను చెవులలో ఊదుతారు; మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే
Verse 224 — Surah Ash-Shuara 26:224
మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు
Verse 225 — Surah Ash-Shuara 26:225
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా వారు (కవులు) తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా (ప్రశంసిస్తూ) ఉంటారని
Verse 226 — Surah Ash-Shuara 26:226
మరియు నిశ్చయంగా, వారు తాము ఆచరించని దానిని చెప్పుకుంటారని
Verse 227 — Surah Ash-Shuara 26:227
కాని, (వారిలో) విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ, అల్లాహ్ ను అమితంగా స్మరించే వారూ మరియు - తమకు అన్యాయం జరిగినప్పుడే - ప్రతీకార చర్య తీసుకునే వారు తప్ప! అన్యాయం చేసేవారు తమ పర్యవసానం ఏమిటో త్వరలో తెలుసుకోగలరు